గ్యాంగ్ లీడర్ షేడ్స్ చూపించనున్న అనిల్!
టాలీవుడ్ లో రాజమౌళి తర్వాత అపజయమెరగని డైరెక్టర్ గా అనిల్ రావిపూడి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
By: Tupaki Desk | 10 March 2025 5:41 AMటాలీవుడ్ లో రాజమౌళి తర్వాత అపజయమెరగని డైరెక్టర్ గా అనిల్ రావిపూడి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పటివరకు తాను తీసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్లే. సినిమా సినిమాకీ తన క్రేజ్‌తో పాటూ మార్కెట్ ను పెంచుకుంటూ పోతున్న అనిల్ రావిపూడి ఈ ఇయర్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేసి భారీ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.
అనిల్ తన తర్వాతి సినిమాను మెగాస్టార్ చిరంజీవితో కలిసి చేయనున్న విషయం తెలిసిందే. ఓ మంచి పాయింట్ చెప్పి చిరూని ఒప్పించిన అనిల్ ప్రస్తుతం వైజాగ్ లో స్క్రిప్ట్ వర్క్ లో బిజీగా ఉన్నాడు. అయితే మెగాస్టార్ కోసం అనిల్ ఎలాంటి కథ రెడీ చేస్తున్నాడనేది ఇప్పుడు అందరికీ ఆసక్తిగా మారింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తోంది.
ఈ నేపథ్యంలో అనిల్ చిరూ కోసం ఓ మాస్ ఎంటర్టైనర్ ను రెడీ చేస్తున్నాడని వార్తలొస్తున్నాయి. ఈ సినిమాలో చిరంజీవి గ్యాంగ్ లీడర్ సినిమాలోని షేడ్స్ ఉన్న పాత్రలో నటించనున్నట్టు తెలుస్తోంది. దాని కోసం ఓ కొత్త యాసపై టీమ్ ఆల్రెడీ వర్క్ చేస్తుందని సమాచారం. అంతేకాదు ఈ సినిమాలో చిరంజీవికి లవ్ ట్రాక్ కూడా ఉండదంటున్నారు.
ఇప్పటి ట్రెండ్ కు తగ్గట్టు, పవర్‌ఫుల్ గా ఉంటూనే ఆడియన్స్ కు కొత్తగా అనిపించేలా చిరంజీవి పాత్రను డిజైన్ చేస్తున్నాడట అనిల్. అనిల్ మార్క్ కామెడీ, మాస్ కు చిరంజీవి లాంటి నటుడు, అతని కామెడీ టైమింగ్ తోడైతే అది నెక్ట్స్ లెవెల్ లో ఉండటం ఖాయం. ఈ మూవీలో కూడా అనిల్ ఓ సున్నితమైన అంశాన్ని మరింత బలంగా చెప్పనున్నాడని అంటున్నారు.
1989లో చిరూ హీరోగా వచ్చిన గ్యాంగ్ లీడర్ మూవీ టాలీవుడ్ లో ఓ ల్యాండ్ మార్క్ మూవీగా నిలిచిన విషయం తెలిసిందే. మంచి ఎమోషన్స్, రివెంజ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలోని పవర్‌ఫుల్ డైలాగ్స్, మాస్ ఎలిమెంట్స్ సినిమాను బ్లాక్ బస్టర్ గా నిలిపాయి. ఇప్పుడు అనిల్ కూడా అదే తరహాలో చిరూ కోసం కథను వండుతున్నాడని ఫిల్మ్ నగర్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.