Begin typing your search above and press return to search.

చిరు-రావిపూడి మూవీ షూటింగ్‌, రిలీజ్‌ ఎప్పుడంటే!

చిరంజీవి విశ్వంభర సినిమా తర్వాత చేయబోతున్న మరో ప్రాజెక్ట్ ఇప్పటికే కన్ఫర్మ్‌ అయ్యింది.

By:  Tupaki Desk   |   8 Jan 2025 6:43 AM GMT
చిరు-రావిపూడి మూవీ షూటింగ్‌, రిలీజ్‌ ఎప్పుడంటే!
X

మెగాస్టార్‌ చిరంజీవి ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర సినిమాను చేస్తున్నారు. భారీ విజువల్‌ వండర్‌గా సోషియో ఫాంటసీ డ్రామాగా రూపొందుతున్న విశ్వంభర సినిమా షూటింగ్‌ అనుకున్న సమయంలో పూర్తి కాకపోవడంతో సంక్రాంతికి విడుదల చేయాలని భావించినా సాధ్యం కాలేదు. 2025 సంక్రాంతికి రావాల్సిన విశ్వంభర సినిమాను ఇదే ఏడాది సమ్మర్‌లో విడుదల చేయబోతున్నారు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే విశ్వంభర సినిమాను ఏప్రిల్ నెలలో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. త్రిష హీరోయిన్‌గా నటిస్తున్న విశ్వంభర సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. చిరంజీవి మార్క్ కమర్షియల్‌ ఫిల్మ్‌గా విశ్వంభర ఉంటుందనే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.

చిరంజీవి విశ్వంభర సినిమా తర్వాత చేయబోతున్న మరో ప్రాజెక్ట్ ఇప్పటికే కన్ఫర్మ్‌ అయ్యింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా ఒక సినిమా రూపొందబోతోంది. ఆ సినిమాకు సంబంధించిన చర్చలు సైతం జరిగాయి. ఫైనల్‌ స్క్రిప్ట్‌ వర్క్ బ్యాలన్స్ ఉంది. సంక్రాంతికి వస్తున్నాం సినిమా విజయాన్ని సొంతం చేసుకుంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా చిరంజీవి, అనిల్‌ రావిపూడి కాంబో మూవీ పట్టాలెక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని సమాచారం అందుతోంది. సినీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం చిరంజీవి ఈ సినిమా కోసం జులై నుంచి బల్క్‌ డేట్లు ఇచ్చారు. కేవలం మూడు, నాలుగు నెలల్లోనే సినిమాను పూర్తి చేస్తారని తెలుస్తోంది.

సంక్రాంతి సందర్భంగా జనవరి 15న చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబో మూవీ పూజా కార్యక్రమాలు జరగబోతున్నాయని తెలుస్తోంది. మొత్తానికి సినిమా గురించి చకచక నిర్ణయాలు జరుగుతున్నాయి. ఒక ఫుల్‌ లెంగ్త్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా చిరంజీవితో అనిల్ రావిపూడి సినిమా చేయబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. అదే కనుక జరిగితే మెగా ఫ్యాన్స్‌కి అతి పెద్ద పండుగ అనడంలో సందేహం లేదు. అనిల్ రావిపూడి తన ప్రతి సినిమాను సంక్రాంతికి తీసుకుని రావాలని కోరుకుంటాడు. కనుక చిరంజీవితో తీయబోతున్న సినిమాను సైతం సంక్రాంతికి తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. 2026 సంక్రాంతికి చిరంజీవి సినిమా దాదాపుగా కన్ఫర్మ్‌ అయినట్లే అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

కెరీర్‌ ఆరంభించినప్పటి నుంచి వరుసగా విజయాలు సొంతం చేసుకుంటున్న అనిల్‌ రావిపూడి సినిమా మేకింగ్‌పై గతంలోనే చిరంజీవి ప్రశంసలు కురిపిస్తూ మాట్లాడారు. అనిల్ రావిపూడి ఎఫ్ 2 తరహా ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌ స్క్రిప్ట్‌ని చిరంజీవికి వినిపించారని తెలుస్తోంది. అతి త్వరలోనే సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ను ప్రారంభించి వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్న ఈ సమయంలో జులైలో సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కాబోతుందని సమాచారం అందుతోంది. అనిల్ రావిపూడి మేకింగ్‌లో జెట్‌ స్పీడ్‌గా ఉంటాడు. కనుక చిరంజీవితో తీయబోతున్న సినిమాను మూడు నాలుగు నెలల్లోనే పూర్తి చేసి 2026 సంక్రాంతికి విడుదల చేసే అవకాశాలు లేకపోలేదు.