అనిల్ మళ్లీ సిల్లీ స్టోరీనే ఎంచుకుంటాడా?
విక్టరీ వెంకటేష్‌తో క్రేజీ డైరెక్టర్ అనిల్ రావిపూడి చేసిన ఫ్యామీ ఎంటర్ టైనర్ `సంక్రాంతికి వస్తున్నాం`.
By: Tupaki Desk | 11 April 2025 7:30 AMవిక్టరీ వెంకటేష్‌తో క్రేజీ డైరెక్టర్ అనిల్ రావిపూడి చేసిన ఫ్యామీ ఎంటర్ టైనర్ `సంక్రాంతికి వస్తున్నాం`. ఐశ్వర్య రాజేష్, మీనాక్షీ చౌదరి హీరోయిన్‌లుగా నటించిన ఈ సినిమాని దిల్‌రాజు, శిరీష్ నిర్మించారు. ఈ సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సొంతం చేసుకుని వసూళ్ల పరంగా సరికొత్త రికార్డుల్ని సృష్టించింది. వెంకీ కెరీర్‌లోనే రికార్డు స్థాయి వసూళ్లని రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా విడుదలై దాదాపు రూ.300 కోట్లు రాబట్టి ట్రేడ్‌వర్గాలని విస్మయానికి గురి చేసింది.
`గేమ్ ఛేంజర్` నష్టాలతో ఉక్కిరిబిక్కిరి అయిన దిల్ రాజుకు బిగ్ రిలీఫ్‌ని ఇవ్వడమే కాకుండా కాంబినేషన్‌ల కోసం పరుగులు పెట్టి కోరి ఇబ్బందుల్ని కొనితెచ్చుకోవద్దనే గుణపాఠాన్ని నేర్పింది. ఈ సినిమాతో కాంబినేషన్‌ల కంటే కంటెంట్‌ని మాత్రమే నమ్ముకుని సినిమాలు చేస్తానని దిల్ రాజు ఓపెన్‌గా ప్రకటించడం విశేషం. ఇదిలా ఉంటే `సంక్రాంతికి వస్తున్నాం` మూవీతో ట్రెమండస్ బ్లాక్ బస్టర్‌ని దక్కించుకుని అనిల్ రావిపూడి దీని తరువాత మెగాస్టార్ చిరంజీవితో ఓ భారీ సినిమాకు శ్రీకారం చుడుతున్న విషయం తెలిసిందే.
సాహు గారపాటి, కొణిదెల సుష్మిత ఈ ప్రాజెక్ట్‌ని నిర్మించబోతున్నారు. ఇటీవలే ప్రమోషనల్ వీడియోని విడుదల చేసి సినిమాపై అంచనాల్ని పెంచేశాడు అనిల్ రావిపూడి. అయితే అంతా బాగానే ఉంది కానీ బాస్ కోసం అనిల్ మళ్లీ సిల్లీ స్టోరీని ఎంచుకుంటాడా లేక బలమైన కథతో వస్తాడా? అనే చర్చ అభిమానుల్లో జరుగుతోంది. ఎందుకంటే `సంక్రాంతికి వస్తున్నాం` మూవీ కోసం ఓ సిల్లీ కథని ఎంచుకుని కిడ్నాప్ డ్రామాకు కామేడీని జోడించి తెరకెక్కించాడు.
సక్సెస్ సాధించాడు. అయితే మెగాస్టార్ సినిమాకు కూడా ఇదే తరహా సిల్లీ కథని ఎంచుకుంటే మాత్రం ఆడియన్స్ ఆదరించడం కష్టమనే కామెంట్‌లు వినిపిస్తున్నాయి. చిరు అవకాశం ఇచ్చాడు కాబట్టి అనిల్ రావిపూడి ఈ సారి బలమైన కథతో వస్తాడా? లేక తన పంథాలోనే మరో సిల్లీ కథనే ఎంచుకుంటాడో తెలియాలంటే వచ్చే ఏడాది సంక్రాంతి వరకు వేచి చూడాల్సిందే.