Begin typing your search above and press return to search.

'మెగా అనిల్' అడ్వాన్స్ సర్ ప్రైజ్.. గెట్ రెడీ!

ప్రస్తుతం ఈ టీజర్ కాన్సెప్ట్ రెడీ చేసే పనిలో అనిల్ ఉన్నారని, త్వరలోనే చిత్రీకరణ ప్రారంభమవుతుందని సమాచారం.

By:  Tupaki Desk   |   23 Jan 2025 2:35 PM GMT
మెగా అనిల్ అడ్వాన్స్ సర్ ప్రైజ్.. గెట్ రెడీ!
X

రాజమౌళి తరువాత టాలీవుడ్‌లో అత్యధిక కమర్షియల్ సక్సెస్ రేటు కలిగిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. ఇప్పటివరకు అనిల్ డైరెక్ట్ చేసిన ప్రతి సినిమా నిర్మాతలకు లాభాలనే అందించాయి. మాస్ హీరోల ఇమేజ్‌ను దృష్టిలో ఉంచుకుని ఆయన చేసే మేకింగ్‌లో కామెడీ, మాస్ ఎలిమెంట్స్ పరిపూర్ణంగా ఉంటాయి. తాజాగా వెంకటేష్‌కు సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో కెరీర్ బెస్ట్ హిట్ అందించిన అనిల్, ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో మరో మాస్ ఎంటర్టైనర్ చేయబోతున్నాడు.

అనిల్ రావిపూడి, మెగాస్టార్ కాంబినేషన్ పై ఇప్పటికే అంచనాలు ఒక రేంజ్ లో క్రియేట్ అయ్యాయి. చిరు ఫ్యాన్స్‌కు ఇది పండుగ లాంటి కాంబినేషన్ అని చెప్పవచ్చు. సంక్రాంతి బాక్సాఫీస్ హవా తరువాత అనిల్ తన మార్క్ మాస్ ఎంటర్టైనర్‌గా ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా స్క్రిప్ట్ పూర్తవ్వడంతో చిరు కూడా తక్షణమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

ఇక భోళా శంకర్ ఆచార్య లాంటి ఫలితాల తరువాత చిరు వాల్తేరు వీరయ్య సినిమాతో ట్రాక్ లోకి వచ్చారు. ఇక ఫ్యాన్స్ అభిమానులు ఆయన నుంచి మరొక బ్లాక్‌బస్టర్‌ను ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో అనిల్‌తో ఈ ప్రాజెక్ట్ పట్ల అభిమానుల్లో మరింత ఆసక్తి నెలకొంది. అయితే ఈ సినిమా చిత్రీకరణ ముందే మరొక పెద్ద అప్‌డేట్ వినిపిస్తోంది. మహా శివరాత్రి సందర్భంగా ఒక ప్రత్యేక టీజర్‌ను రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం.

ఈ టీజర్‌ను జైలర్ 2 తరహాలో అనౌన్స్‌మెంట్ టీజర్‌గా స్పెషల్‌గా రూపొందించనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ టీజర్ కాన్సెప్ట్ రెడీ చేసే పనిలో అనిల్ ఉన్నారని, త్వరలోనే చిత్రీకరణ ప్రారంభమవుతుందని సమాచారం. ఈ అప్‌డేట్‌తో మెగాస్టార్ అభిమానుల్లో ఆనందం మరింత పెరిగింది. ఈ సినిమాకు సంబంధించి షైన్ స్క్రీన్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మాణ బాధ్యతలు చేపట్టింది. ప్రస్తుతం విశ్వంభర షూటింగ్ దశలో ఉన్న చిరు, ఈ సినిమా పూర్తి కాగానే అనిల్ సినిమా సెట్స్ మీదకు వెళ్తారని తెలుస్తోంది.

మరోవైపు, నానితో సినిమా చేస్తున్న శ్రీకాంత్ ఓదెల ప్రాజెక్ట్ కూడా చిరు లైనప్‌లో ఉంది. కానీ అది కొంత ఆలస్యం కావడం వల్ల అనిల్ సినిమా ముందుగా సెట్స్ మీదకు వెళ్తుందని సమాచారం. మెగాస్టార్ చిరు ప్రస్తుతం తన కెరీర్‌లో ఉన్న కొంత తడబడిన దశను అధిగమించేందుకు ఆసక్తిగా ఉన్నారు. ఈ క్రమంలో నూతన తరం దర్శకులైన వశిష్ఠ, అనిల్ రావిపూడి వంటి వారితో పనిచేస్తూ కొత్త ప్రయోగాలకు సిద్ధమవుతున్నారు. చిరు ఇమేజ్‌ను కొత్త ఎత్తుకు తీసుకెళ్లే ప్రయత్నంలో అనిల్ సినిమా కీలకంగా నిలవబోతోందని విశ్లేషకులు అంటున్నారు.