హిట్ సినిమాకు కేరాఫ్ అడ్రస్..!
పదేళ్ల కెరీర్ లో 8 సినిమాలు తీసి అన్ని హిట్లు కొట్టిన డైరెక్టర్ గా అనీల్ రావిపూడి సెపరేట్ రికార్డ్ సృష్టించాడు.
By: Tupaki Desk | 23 Jan 2025 7:06 AM GMTఅవకాశం ప్రతి ఒక్కరికీ వస్తుంది. అలా వచ్చిన ఛాన్స్ ని వాడుకోవడంలోనే అసలైన కిక్ ఉంటుంది. వచ్చిన అవకాశాన్ని వాడుకుని సక్సెస్ లు కొడుతుంటేనే అలాంటి వారికి మళ్లీ మళ్లీ ఛాన్సులు వస్తుంటాయి. ప్రస్తుతం టాలీవుడ్ లో ఒక దర్శకుడు హిట్ సినిమాకు కేరాఫ్ అడ్రస్ గా మారాడు. ఆయన చేస్తున్న సినిమాలు అన్ని వరుస సూపర్ హిట్లు కొడుతున్నాయి. ఈమధ్యనే సంక్రాంతికి మరో కొత్త సినిమాతో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు ఈ డైరెక్టర్. పదేళ్ల కెరీర్ లో 8 సినిమాలు తీసి అన్ని హిట్లు కొట్టిన డైరెక్టర్ గా అనీల్ రావిపూడి సెపరేట్ రికార్డ్ సృష్టించాడు.
అంతకుముందు రైటర్ గా ఒకటి రెండు సినిమాలకు పనిచేసిన అనిల్ రావిపూడి డైరెక్టర్ గా మారి తొలి సినిమా పటాస్ తో తన సత్తా చాటాడు. కళ్యాణ్ రామ్ తో తీసిన ఆ సినిమా హిట్ అవ్వడంతో అనిల్ డైరెక్షన్ టాలెంట్ అందరికీ తెలిసింది. ఆ తర్వాత సాయి ధరం తేజ్ తో సుప్రీం తీయగా అది కూడా హిట్ అయ్యింది. ఆ నెక్స్ట్ మాస్ రాజాతో రాజా ది గ్రేట్ సినిమా చేశాడు. ఆ సినిమా కూడా మంచి సక్సెస్ అయ్యింది.
హ్యాట్రిక్ హిట్ కొట్టాం కదా అని ట్రాక్ తప్పకుండా మరింత ఫోకస్ తో F2 చేసి అది సూపర్ హిట్ కొట్టి ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ తో సరిలేరు నీకెవ్వరు సినిమా తీసి దాన్ని బ్లాక్ బస్టర్ చేశాడు అనిల్ రావిపూడి. ఆ నెక్స్ట్ F3 అంటూ మరో సినిమా తీశాడు. ఇక బాలకృష్ణతో భగవంత్ కేసరి కూడా మాస్ హిట్ అందుకుంది. F2, F3 తర్వాత వెంకటేష్ తో థర్డ్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం సినిమా సూపర్ హిట్ అయ్యింది.
సంక్రాంతికి వస్తున్నాం హిట్ తో 8 సినిమాలు 8 హిట్లు కొట్టాడు అనిల్ రావిపూడి. వీటిలో అన్ని మంచి సక్సెస్ అందుకోగా ఐదు సినిమాలు వరుసగా 100 కోట్లు కలెక్ట్ చేయగా ఐదు సినిమాలు యూఎస్ లో 1 మిలియన్ మార్క్ దాటేశాయి. 10 ఏళ్ల కెరీర్ 8 సినిమాలతో అనిల్ రావిపూడి ఏ డైరెక్టర్ క్రియేట్ చేయలేని సక్సెస్ రేటు సొంతం చేసుకున్నాడు. అనిల్ రావిపూడి సినిమా అంటే సూపర్ హిట్ పక్కా అనేలా చేసుకున్నాడు. ఒకటి రెండు సక్సెస్ లు కొడితేనే నెక్స్ట్ సినిమాకు ఓవర్ కాన్ ఫిడెన్స్ వచ్చేస్తుంది. అలాంటిది 8 సినిమాలు అది కూడా వరుస సక్సెస్ లు అందుకోవడం చాలా గొప్ప విషయమని చెప్పొచ్చు. దర్శక ధీరుడు రాజమౌళి తర్వాత ఇలా చేసిన సినిమాలన్నీ సూపర్ సక్సెస్ అందుకున్న డైరెక్టర్ గా అనిల్ రావిపూడి తన పేరు మీద స్పెషల్ రికార్డ్ ఏర్పరచుకున్నాడు.