Begin typing your search above and press return to search.

మహేష్ తో రావిపూడి మరో మూవీ.. అసలు విషయమిది..

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఇప్పుడు దర్శకధీరుడు రాజమౌళితో చేస్తున్న సినిమా కోసం సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   4 Jan 2025 9:30 AM GMT
మహేష్ తో రావిపూడి మరో మూవీ.. అసలు విషయమిది..
X

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఇప్పుడు దర్శకధీరుడు రాజమౌళితో చేస్తున్న సినిమా కోసం సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. హైదరాబాద్ లో ఇటీవల పూజా కార్యక్రమాలు జరగ్గా.. త్వరలో రెగ్యులర్ షూటింగ్ మొదలు కానున్నట్లు తెలుస్తోంది. అందుకు గాను జక్కన్న ఏర్పాట్లను పూర్తి చేసే పనిలో ఉన్నారు.

అయితే SSMB 29కి విజయేంద్రప్రసాద్ కథ అందించగా.. ఎం ఎం కీరవాణి బాణీలు కడుతున్నారు. హీరోయిన్ గా గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రాను.. విలన్ గా పృథ్వీరాజ్ సుకుమారన్ ను ఫిక్స్ చేసినట్లు కొద్దిరోజులుగా టాక్ వినిపిస్తోంది. ఇండియాతో పాటు కెన్యాలో షూటింగ్ జరపనున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.

ప్రపంచాన్ని చుట్టేసే ఓ సాహస ప్రయాణంగా, అటవీ నేపథ్యంలో సాగే కథతో సినిమా తెరకెక్కిస్తున్నట్లు.. రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం. రీసెంట్ గా గేమ్ ఛేంజర్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో హీరో రామ్ చరణ్ చెప్పినట్లు.. 2026లో SSMB 29 ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది.

అయితే రాజమౌళితో మహేష్ మూవీ స్టార్ట్ అయ్యే లోపు.. ఆయన అనిల్ రావిపూడితో ఓ సినిమా చేస్తే బాగుండేదని ఆ మధ్య అనేక మంది ఫ్యాన్స్ అభిప్రాయపడ్డారు. జక్కన్న ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వడానికి టైమ్ పడుతుంది.. దానికి తోడు రావిపూడి స్పీడ్ గా సినిమా పూర్తి చేస్తారు.. అందుకే అలా జరిగి ఉంటే బాగుండేదని అనుకున్నారు.

ఇప్పుడు ఆ విషయంపై అనిల్ రావిపూడి స్పందించారు. మహేష్ గారితో రాజమౌళి గారు మూవీ ఉండడమే కరెక్ట్ అని, మధ్యలో తనతో పని చేయడం కరెక్ట్ కాదన్నట్లు తెలిపారు. మహేష్ గారు చాలా క్లారిటీగా ఉన్నారని తెలిపారు. ఆయనతో ఈ మధ్య రెండు మూడు యాడ్స్ చేశానని.. కొంతకాలం జర్నీ చేశానని చెప్పారు.

"మహేష్ గారు ఒకటి ఫిక్స్ అయ్యారంటే అది నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. మైండ్ బ్లాక్ సాంగ్ అందుకు ఎగ్జాంపుల్.. అప్పటి వరకు మహేష్ అంతలా డ్యాన్స్ చేయలేదు. ఆ సినిమాకు సాంగ్ కంపోజ్ అయిన వెంటనే.. బ్రదర్ ఈ సాంగ్ నా కోసమే అని చెప్పారు.. చేస్తా అని ఫిక్స్ అయ్యారు.. చేసేశారు.. గుంటూరు కారం అయితే వేరే లెవెల్" అని తెలిపారు.

"బిగ్గెస్ట్ డైరెక్టర్ రాజమౌళితో మహేష్ మూవీ అంటే వేరే లెవెల్ అంచనాలు ఉంటాయి. అందుకు తగ్గట్లే వాళ్ళు ఫుల్ ప్లాన్ తో ప్రిపేర్డ్ గా ఉన్నారు" అని రావిపూడి చెప్పారు. అయితే మహేష్, అనిల్ రావిపూడి కాంబోలో ఇప్పటికే వచ్చిన సరిలేరు నీకెవ్వరు సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. 2020 సంక్రాంతికి రిలీజైన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ గా నిలిచి.. కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ గా మెప్పించింది.