Begin typing your search above and press return to search.

గేరు మార్చిన అనీల్..చిరు-నాగ్ ని సెట్ చేస్తున్నాడా!

మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాకి స‌న్నాహాలు జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   29 Dec 2024 7:00 PM GMT
గేరు మార్చిన అనీల్..చిరు-నాగ్ ని సెట్ చేస్తున్నాడా!
X

మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాకి స‌న్నాహాలు జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే. ఆ సినిమా నెంబ‌ర్ చిరంజీవి 156 అవుతుందా? 157 అవుతుందా? అన్న‌ది తెలియ‌దుగానీ ప్లానింగ్ అయితే జ‌రుగుతోంది. వ‌చ్చే ఏడాది చిత్రాన్ని ప‌ట్టాలెక్కించ‌నున్న‌ట్లు ప్ర‌చారంలో ఉంది. అయితే ఇప్పుడీ స్టోరీ విష‌యంలో అనీల్ కొత్త ట‌ర్నింగ్ తీసుకున్న‌ట్లు గుస‌గుస వినిపిస్తుంది. ఈ క‌థ‌ని కేవ‌లం చిరంజీవితో కాకుండా కింగ్ నాగార్జున‌తో క‌లిపి చేయాల‌ని ప్లాన్ చేస్తున్నాడుట‌.

క‌థ‌లో కొన్ని ర‌కాల మార్పులు చేస్తే అది మ‌ల్టీస్ట‌ర‌ర్ గా మార్చ‌వ‌చ్చ‌ని అనీల్ భావిస్తున్నాడుట‌. ఇదే నిజ‌మైతే మెగా-కింగ్ అభిమానులు కోరిక తీరిపోతుంది. చిరంజీవి-నాగార్జుల‌ను ఒకే ప్రేమ్ లో చూడాల‌ని ఇద్ద‌రి హీరోల అభిమా నులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు. ఇద్దరు ఎంత గొప్ప స్నేహితులు అన్న‌ది చెప్పాల్సిన ప‌నిలేదు. క‌లిసి వ్యాపారాలు చేస్తున్నారు. ఖాళీ స‌మ‌యం దొరికితే చిరంజీవి టైంపాస్ చేసేది కేవ‌లం నాగార్జున‌తో మాత్ర‌మే.

అలాంటి నాగ్ తో న‌టించాల‌ని చిరంజీవి చాలా కాలంగా ఆశ‌ప‌డుతున్నారు. కానీ స్టోరీ సెట్ కాక‌పోవ‌డంతో సాధ్య ప‌డ‌లేదు. ఇప్పుడు అనీల్ రూపంలో చిరంజీవికి ఆ ఛాన్స్ దొరుకుతున్న‌ట్లే క‌నిపిస్తుంది. ఒకేసారి ఇద్ద‌రు స్టార్ హీరోల‌ను గానీ, సీనియ‌ర్ హీరోల‌ను గానీ డీల్ చేయ‌డం అన్న‌ది అనీల్ కి కొట్టిన పిండి. `ఎఫ్ -2`,` ఎఫ్ -3` చిత్రాల‌తో వెంక‌టేష్‌- వ‌రుణ్ తేజ్ ల‌ను డీల్ చేసాడు.

ఆ కాంబోలో వ‌చ్చిన రెండు చిత్రాలు ఎలాంటి విజ‌యం సాధించాయో తెలిసిందే. ఈ నేప‌థ్యంలో చిరు-నాగ్ ల‌ను మ్యానేజ్ చేయ‌డం పెద్ద విషయం కాదు. అయితే క‌థ అన్న‌దే ఇక్క‌డ కీల‌కం. అదీ అనీల్ మార్క్ స్టోరీ అవుతుం దా? అందుకు భిన్నంగా ప్లాన్ చేస్తున్నాడా? అన్న‌ది తెలియాలి. ఎఫ్ -2 చిత్రాల‌ను కామెడీ నేప‌థ్యంలోనే తెర‌కెక్కించిన సంగ‌తి తెలిసిందే.