అనీల్ పాన్ ఇండియా ఎప్పుడంటే?
ఇంకా తనకి అంత అనుభవం రాలేదన్నాడు. నాలుగేళ్ల తర్వాత పాన్ ఇండియా సినిమా గురించి ఆలోచిస్తానన్నాడు.
By: Tupaki Desk | 11 Jan 2025 3:43 AM GMTసక్సెస్ ల్లో ఉన్న దర్శకులంతా పాన్ ఇండియా అంటూ పరుగులు పెడుతోన్న సంగతి తెలిసిందే. రాజమౌళి తర్వాత చందు మోండేటి, ప్రశాంత్ వర్మ, సుకుమార్ , కొరాటాల శివ ఇప్పటికే పాన్ ఇండియా లో సినిమాలు తీసి సక్సెస్ అయ్యారు. మరి ఫుల్ ఫాంలో ఉన్న యంగ్ డైరెక్టర్ అనీల్ రావిపూడి పాన్ ఇండియా సినిమా ఎప్పుడు తీస్తున్నాడు? అంటే ..ఇప్పట్లో పాన్ ఇండియా సినిమా ఆలోచనే లేదనేసాడు. ఇంకా తనకి అంత అనుభవం రాలేదన్నాడు. నాలుగేళ్ల తర్వాత పాన్ ఇండియా సినిమా గురించి ఆలోచిస్తానన్నాడు.
అదీ కూడా పరిస్థితులున్నీ అనుకూలంగా ఉంటనే ముందుకెళ్తాను . లేకపోతే లేదు అన్నాడు. ఇక్కడే మరిన్ని విభిన్నమైన సినిమాలు చేయాలని తెలిపాడు. ఇప్పటివరకూ అనీల్ రావిపూడికి వైఫల్యం లేదు. చేసిన సినిమాలన్నీ మంచి విజయం సాధించాయి. కమర్శియల్ గా కాసులు తెచ్చిపెట్టిన చిత్రాలే.అందులో సగం దిల్ రాజు బ్యానర్లోనే ఉంటాయి. అలా అనీల్ కి ఆబ్యానర్ హోం బ్యానర్లా మారిపోయింది. అనీల్ చేసిన సినిమాలన్నీ ఫ్యామిలీ, కామెడీ ఎంటర్ టైనర్లే.
ఇదే జోనర్లో పాన్ ఇండియా సినిమాలు తీస్తే పనవ్వదు. అందుకే అనీల్ కూడా తొందర పడటం లేదు. పాన్ ఇండియా కంటెంట్ అంటే ఆ కథ అన్ని భాషలకు కనెక్ట్ అవ్వాలి. యూనివర్శల్ అప్పీల్ తీసుకురావాలి. అందుకే త్రివిక్రమ్ కూడా ఇంతవరకూ పాన్ ఇండియా సినిమాకు దూరంగా ఉన్నాడు. బన్నీ కోసం మైథలాజీ టచ్ ఉన్న ఓ కథని సిద్దం చేసి త్వరలో పాన్ ఇండియా సినిమా మొదలు పెడుతున్నాడు.
అనీల్ కూడా పాన్ ఇండియాకి ప్రమోట్ అవ్వాలంటే? గురూజీలా కథల విషయంలో భారీ మార్పులు తీసుకు రావాలి. అందుకే అనీల్ నాలుగేళ్లు సమయం తీసుకుంటున్నాడు. ఇక అనీల్ దర్శకత్వంలో వహించిన `సంక్రాంతికి వస్తున్నాం` 14న రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే `గేమ్ ఛేంజర్` ఔట్ అయిన నేపథ్యంలో? సంక్రాంతికి మరింత ప్లస్ గా మారుతుందని తెలుస్తుంది.