Begin typing your search above and press return to search.

జన నాయగన్ తో డైరెక్టర్ కి సంబంధం లేదా..?

విజయ్ చివరి సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వచ్చిన భగవంత్ కేసరి రీమేక్ అని టాక్.

By:  Tupaki Desk   |   20 Feb 2025 2:45 AM GMT
జన నాయగన్ తో డైరెక్టర్ కి సంబంధం లేదా..?
X

టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి రీసెంట్ గా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మరో సూపర్ హిట్ అందుకున్నాడు. కెరీర్ లో 8 సినిమాలు తీసి అన్నిటినీ సక్సెస్ చేసుకున్న ఈ డైరెక్టర్ తన సినిమా వేరే భాషలో రీమేక్ అవుతుందని తెలిసినా సైలెంట్ గా ఉన్నాడు. దళపతి విజయ్ హీరోగా హెచ్.వినోద్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా జన నాయగన్. విజయ్ చివరి సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వచ్చిన భగవంత్ కేసరి రీమేక్ అని టాక్.

ఈమధ్య ఒక తమిళ నటుడు కూడా ఈ విషయాన్ని చెప్పారు. అనిల్ రావిపూడి ఎంత వారిస్తున్నా ఆ నటుడు ఈ విషయం చెప్పే దాకా మైక్ వదల్లేదు. అసలైతే దళపతి విజయ్ ఈ సినిమాను అనిల్ డైరెక్షన్ లోనే చేయాలని అనుకున్నా అనిల్ ఎందుకో కాదని చెప్పినట్టు టాక్. అందుకే కథ మాత్రమే తీసుకుని అక్కడ డైరెక్టర్ తో రీమేక్ చేయిస్తున్నారు.

ఐతే ఈ సినిమాను విజయ్ పొలిటికల్ ఇమేజ్ కి పని వచ్చేలా చేస్తున్నారని తెలుస్తుంది. దళపతి విజయ్ చివరి సినిమా అనగానే ఫ్యాన్స్ లో అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. జన నాయగన్ పోస్టర్ తోనే దళపతి ఫ్యాన్స్ ఊగిపోయేలా చేశాడు డైరెక్టర్ హెచ్.వినోద్. ఐతే అనిల్ ఆ సినిమా కాదనడానికి రీజన్ కూడా ఇదే అయ్యుండొచ్చని టాక్. ఎందుకంటే విజయ్ ఫ్యాన్స్ మెచ్చేలా సినిమా తీయాలి అందులోనూ కొంత లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది. అందుకే ఆ ఆఫర్ కాదని చెప్పుండొచ్చు.

ఐతే జన నాయగన్ భగవంత్ కేసరి రీమేక్ అని తెలుస్తున్నా ఇటు ఆ సినిమా ప్రొడక్షన్ కానీ డైరెక్టర్ గానీ అసలు తమకు ఏమాత్రం సంబంధం లేదన్నట్టు ఉన్నారు. మరి దీని వెనక రీజన్స్ ఏంటన్నది తెలియదు కానీ అనిల్ రావిపూడి కథ ఇచ్చినా జన నాయగన్ గురించి ఎందుకు ఇంత సైలెంట్ గా ఉంటున్నారు అన్నది తెలియాల్సి ఉంది. మరి జన నాయగన్ టైటిల్స్ లో అయినా అనిల్ పేరు ఉంటుందా లేదా అది కూడా సంబంధం లేదన్నట్టుగా డీల్ కుదుర్చుకున్నారా అన్నది చూడాలి. ఇక సంక్రాంతికి వస్తున్నాంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమా మెగాస్టార్ చిరంజీవితో ఫిక్స్ చేసుకున్నాడు. ఆ సినిమా కూడా నెక్స్ట్ సంక్రాంతికి రిలీజ్ టార్గెట్ అని టాక్.