బాబోయ్ ఈ డైరెక్టర్ పెద్ద స్కెచ్చే వేశాడుగా..!
అంతకుముందు భగవంత్ కేసరితో హిట్ అందుకున్న అనిల్ రావిపూడి సంక్రాంతి పండగకి సంక్రాంతికి వస్తున్నాం తో వస్తున్నాడు.
By: Tupaki Desk | 11 Jan 2025 2:26 PM GMTటాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా ముద్ర వేసుకున్న వారిలో అనిల్ రావిపూడి కూడా ఒకడు. రాజమౌళి తర్వాత చేసిన ప్రతి సినిమా హిట్ అందుకున్న డైరెక్టర్ గా అనిల్ రావిపూడి మంచి ట్రాక్ రికార్డ్ సంపాదించాడు. తను చేసే హీరోల స్ట్రెంత్ తో పాటుగా ఆడియన్స్ పల్స్ కూడా పట్టేసిన ఈ డైరెక్టర్ తో సినిమా అంటే హీరోలు కూడా హిట్టు పక్కా అని ఫిక్స్ అయ్యేలా చేసుకున్నాడు. అంతకుముందు భగవంత్ కేసరితో హిట్ అందుకున్న అనిల్ రావిపూడి సంక్రాంతి పండగకి సంక్రాంతికి వస్తున్నాం తో వస్తున్నాడు.
విక్టరీ వెంకటేష్ తో ఎఫ్2, ఎఫ్3 సినిమాలు చేసిన అనిల్ రావిపూడి థర్డ్ సినిమా తో హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నాడు. పటాస్ నుంచి భగవంత్ కేసరి వరకు సూపర్ హిట్ లు అందుకున్న అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్నాతో కూడా తన హిట్ మేనియా కొనసాగించాలని చూస్తున్నాడు. ఇక సంక్రాంతికి వస్తున్నాం సినిమా ప్రమోషన్స్ లోనే నెక్స్ట్ మెగాస్టార్ చిరంజీవితో సినిమా కన్ ఫర్మ్ అని చెప్పేశాడు. ఐతే చిరుతో సినిమా ఏం చేయాలన్నది ఇంకా డిసైడ్ చేయలేదని అంటున్నాడు అనిల్ రావిపూడి.
ఇదిలాఉంటే రీసెంట్ ఇంటర్వ్యూలో చిరంజీవి గారితో సినిమా ఎలాగు చేస్తున్నా కాబట్టి నాగార్జున గారితో కూడా సినిమా చేస్తే టాలీవుడ్ నాలుగు స్థంభాలతో ఈ జనరేషన్ లో సినిమాలు చేసిన ఒకే ఒక్క దర్శకుడిగా ప్రత్యేకంగా ఉంటుందని అంటున్నాడు అనిల్ రావిపూడి. ఈమధ్య ఇంటర్వ్యూస్ లోనే కింగ్ నాగార్జున గారితో హలో బ్రదర్ లాంటి సినిమా చేయాలని ఉందని అనిల్ చెప్పాడు.
నాగార్జునతో అనిల్ హలో బ్రదర్ చేస్తే మాత్రం సినిమా సెట్స్ మీదకు వెళ్లకముందే భారీ హైప్ వచ్చేస్తుందని చెప్పొచ్చు. సో టాలీవుడ్ లో సీనియర్ స్టార్స్ నలుగురితో చేసే ప్లాన్ ని బాగానే ఎగ్జిక్యూట్ చేస్తున్నాడు అనిల్ రావిపూడి. మరి చిరు సినిమా ఓకే అయ్యిందని చెబుతున్నా అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది. ఆ తర్వాత నాగార్జున సినిమా కూడా ఎప్పుడు వస్తుందో చూడాలి. ఎలాగు సక్సెస్ ఫాం లో ఉన్నాడు కాబట్టి అనిల్ రావిపూడి కథ చెబితే కాదనే పరిస్థితి అయితే ఉండదు. సో మెగాస్టార్ తర్వాత కింగ్ నాగ్ ని లైన్ లోకి తెస్తే అక్కినేని ఫ్యాన్స్ కూడా ఈ కాంబోని ఫుల్ గా ఎంజాయ్ చేస్తారని చెప్పొచ్చు.