రీజనల్ సినిమా 300 కోట్లు.. నా కెరీర్ లో ఇది పీక్..!
ఇక సినిమా గురించి ఫస్ట్ క్రెడిట్ ఇవ్వాలంటే అది వెంకటేష్ గారికే అని.. మాతో పాటు ప్రమోషన్స్ కి ఎక్కడికి కావాలంటే అక్కడికి వచ్చారు.
By: Tupaki Desk | 1 Feb 2025 2:28 PM GMTసంక్రాంతికి వస్తున్నాం డిస్ట్రిబ్యూటర్స్ కి మంచి లాభాలు తెచ్చి పెట్టినందుకు తన సంతోషాన్ని వ్యక్తం చేశారు సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి. వెంకటేష్ హీరోగా ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటించిన ఈ సినిమా సంక్రాంతి రేసులో రిలీజై సూపర్ హిట్ అందుకుంది. ఈ సక్సెస్ సందర్భంగా డిస్ట్రిబ్యూటర్స్ గ్రాటిట్యూడ్ మీట్ ఏర్పాటు చేయగా అందులో అనిల్ రావిపూడి ఎనర్జిటిక్ స్పీచ్ తో అలరించారు.
ఒక రీజనల్ సినిమా 300 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తుంది అది తన సినిమా అవుతుందని అనుకోలేదని అన్నారు అనిల్ రావిపూడి. మొన్నటిదాకా సినిమా ప్రమోషన్స్ చేసి అలసిపోయాం కానీ ఆడియన్స్ మేము అలసిపోలేదు అని 3 వారంలో కూడా సినిమా చూస్తున్నారు. ఈ సినిమా బెనిఫిట్ షోస్ కి ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చారు. కొన్ని అద్భుతాలు జరిగినప్పుడు చూస్తూ ఎంజాయ్ చేయాలి నా కెరీర్ లో ఇది పీక్ అని అన్నారు అనిల్ రావిపూడి.
ఇక సినిమా గురించి ఫస్ట్ క్రెడిట్ ఇవ్వాలంటే అది వెంకటేష్ గారికే అని.. మాతో పాటు ప్రమోషన్స్ కి ఎక్కడికి కావాలంటే అక్కడికి వచ్చారు. ఎంతో అల్లరి చేశారు. ఈవెంట్ లో బ్లాక్ బస్టర్ సాంగ్ వస్తే అలా లేచి వెళ్లి పోయి డ్యాన్స్ చేశారని అన్నారు అనిల్ రావిపూడి. రిలీజ్ తర్వాత కూడా వెంకటేష్ గారితో సక్సెస్ షేర్ చేసుకుంటూ నెక్స్ట్ ఏం చేయాలన్నది కూడా చర్చించామని అన్నారు.
సంక్రాంతికి వస్తున్నాం సినిమా ప్రమోషన్స్ లో ఇద్దరు హీరోయిన్స్ చాలా బాగా సపోర్ట్ చేశారని. ప్రమోషన్స్ కి కొందరు సాకులు చెబుతారు కానీ ఈ ఇద్దరు ఏది చేయమన్నా చేశారు. గెటప్ లు వేసుకుని మరీ సపోర్ట్ చేశారు. ఇలాంటి యాక్ట్రెస్ లు దొరకడం చాలా హ్యాపీ వాళ్లకి థాంక్స్ అని అన్నారు అనిల్ రావిపూడి. డైరెక్టర్ గా పటాస్ నుంచి తీసిన ప్రొడ్యూసర్ నవ్వుతూ ఉండాలని అనుకుంటా అన్నారు అనిల్ రావిపూడి. అదే నా టార్గెట్ అని చెప్పారు. ఫస్ట్ రోజు మార్నింగ్ షో అయ్యాక ప్రొడ్యూసర్ ని కలిస్తే నవ్వుతూ ఎదురు రావాలి అంతే కానీ వీడు ఎందుకొచ్చాడ్రా అనుకోకూడదు. ఆ భయం ఉంటుంది.. ప్రొడ్యూసర్ సేఫ్ ఉండాలని ఫస్ట్ నుంచి ఆలోచిస్తా అదే క్రైటీరియాతో పనిచేస్తా అన్నారు అనిల్ రావిపూడి.
ఇక తాను తీసిన 8 సినిమాల్లో 6 ఈ బ్యానర్ లోనే చేశా.. ఎస్వీసీ బ్యానర్ లో ఎన్నో గొప్ప సినిమాలు వచ్చాయి. ఈ బ్యానర్ ఇంకా కొన్ని డెకేడ్స్, జనరేషన్స్ ఉండాలి.. ఉంటుందని అన్నారు అనిల్ రావిపూడి. ఈ సినిమా ద్వారా డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ లెక్క చెప్పుకోని నెంబర్స్ వచ్చాయి. అందుకు చాలా హ్యీపా అన్నారు అనిల్ రావిపూడి.
రీజనల్ మూవీకి 6 రోజుల్లో 100 కోట్లు.. రీజనల్ ఫిలిం కి 300 కోట్లు ఇలాంటివి ఎప్పుడు వినలేదు.. అందుకు హ్యాపీ.. ఇప్పుడు నెక్స్ట్ సినిమాకు ఇంకాస్త రెస్పాన్సిబిలిటీ పెరిగిందని అన్నారు అనిల్ రావిపూడి. ఇక ఇదే క్రమంలో స్టేజ్ మీద ఉన్న వారు ఎవరి మనోభావాలైనా దెబ్బతినేలా మాట్లాడి ఉంటే మీరేమీ ఫీల్ అవ్వకండి అని అన్నారు. వాళ్లు చాలా సంతోషంగా ఉన్నారు.. బీ హ్యాపీ స్టే పాజిటివ్ అని అన్నారు అనిల్. సంక్రాంతికి వస్తున్నాం మరో ఈవెంట్ ఉంటుందని ఫినిషింగ్ టచ్ తో సంక్రాంతికి వస్తున్నాం జర్నీ పూర్తి చేస్తామని అన్నారు అనిల్ రావిపూడి.