Begin typing your search above and press return to search.

వెంకీ, అనిల్ మూవీ.. ఒక పని పూర్తయింది..

హీరో విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబోలో క్రేజీ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   7 Sep 2024 4:38 PM GMT
వెంకీ, అనిల్ మూవీ.. ఒక పని పూర్తయింది..
X

హీరో విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబోలో క్రేజీ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. గతంలో వీరిద్దరు కలిసి వర్క్ చేసిన ఎఫ్ 2, ఎఫ్ 3 సినిమాలు.. కమర్షియల్ గా పెద్ద హిట్ అయ్యాయి. కామెడీ జోనర్ లో రూపొందిన ఆ మూవీలు బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా వసూలు చేశాయి. ఇప్పుడు వెంకీ, అనిల్ కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ మూవీ.. క్రైమ్ థ్రిల్ల‌ర్ జోనర్ లో తెరకెక్కుతోంది. ఐశ్వ‌ర్య రాజేష్, మీనాక్షి చౌద‌రి హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.

ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, ఎక్స్ లెంట్ వైఫ్ కార‌ణంగా హీరో జీవితం ఎలాంటి మ‌లుపులు తిరిగింది.. ఒక‌రి త‌ర్వాత మ‌రొక‌రు ఆయన జీవితంలో ఎలా ఎంట్రీ ఇచ్చారు అనే అంశాల‌తో మూవీ తెరకెక్కుతున్నట్లు ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేశారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఆ మూవీని శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే చెప్పారు.

అయితే వినాయక చవితి సందర్భంగా మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. పొల్లాచ్చిలో టాకీ పార్ట్, పాటలు, యాక్షన్ సీక్వెన్స్‌లతో కూడిన 30+ డేస్ లాంగ్ షెడ్యూల్ ను షూట్ చేసినట్లు చెప్పారు. పొల్లాచి షెడ్యూల్ పూర్తైనట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా స్పెషల్ వీడియోను షేర్ చేశారు. "వెంకీ- అనిల్ 3 టీమ్ తరఫున ప్రతి ఒక్కరికి గణేష్ చతుర్థి శుభాకాంక్షలు. షూటింగ్ సమయంలో సెట్స్‌ లో టీమ్ ఎంజాయ్ చేసినంత ఆనందంగా మీరు ఈ పండుగను జరుపుకోండి" అంటూ రాసుకొచ్చారు.

షూటింగ్ సెట్స్ లో జరిగిన కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్స్ ను మిక్స్ చేసి వీడియోను పోస్ట్ చేశారు. సెట్స్ లో అంతా చాలా ఫ్రెండ్లీగా ఉన్నట్లు కనిపిస్తున్నారు. వీడియో ద్వారా సినిమాలో వెంకటేష్ భార్యగా ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నట్లు క్లారిటీ వచ్చేసింది. గర్ల్ ఫ్రెండ్ గా మీనాక్షీ చౌదరి యాక్ట్ చేస్తోంది. వారి మధ్య షూట్ చేసిన సీన్స్ బిట్స్ ను యాడ్ చేశారు మేకర్స్. సంక్రాంతికి వస్తున్నామని వీడియో లాస్ట్ లో హీరోయిన్లు తెలిపారు. మున్నార్ లో ఇంటర్వెల్ సీక్వెన్స్ చిత్రీకరించినట్లు అనిల్ రావిపూడి వెల్లడించారు.

అయితే వెంక‌టేష్‌, అనిల్ రావిపూడి మూవీకి సంక్రాంతికి వస్తున్నాం అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. పొల్లాచి షెడ్యూల్ లో ఫ్యామిలీ సాంగ్ ను షూట్ చేశారట. సమీర్ రెడ్డి సినిమాటోగ్రాఫ‌ర్‌ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. రాజేంద్ర ప్ర‌సాద్‌, సాయికుమార్‌, న‌రేష్‌ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. మరి ఈ మూవీతో వెంకీ, అనిల్ ఎలాంటి హిట్ కొడతారో చూడాలి.