Begin typing your search above and press return to search.

సంక్రాంతి రిలీజ్.. అనిల్ కు పెద్ద పనే పడింది!

స్టార్‌ హీరోల నుంచి చిన్న హీరోల వరకు ఎక్కువ మంది సంక్రాంతికి రావాలని అనుకుంటారు.

By:  Tupaki Desk   |   19 Oct 2024 10:30 PM GMT
సంక్రాంతి రిలీజ్.. అనిల్ కు పెద్ద పనే పడింది!
X

టాలీవుడ్ సినిమాలకు సంక్రాంతి సీజన్‌ అత్యంత కీలకమన్న విషయం తెలిసిందే. స్టార్‌ హీరోల నుంచి చిన్న హీరోల వరకు ఎక్కువ మంది సంక్రాంతికి రావాలని అనుకుంటారు. అయితే కొన్ని నెలలుగా 2025 పొంగల్ మూవీస్ గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి. ముందుగా.. చిరంజీవి విశ్వంభర, వెంకటేష్‌- అనిల్ రావిపూడి మూవీ, నాగార్జున, రవితేజ సినిమాలు రిలీజ్ అవుతున్నట్లు అనౌన్స్మెంట్స్ వచ్చాయి.

కానీ ఆ తర్వాత అంతా మారింది ప్లాన్. కొత్త సినిమాలు సంక్రాంతి బరిలోకి దిగుతున్నాయి. రామ్ చరణ్ గేమ్ చేంజర్.. డిసెంబర్ లో రిలీజ్ అవుతుందని అంతా అనుకోగా.. పొంగల్ కు షిఫ్ట్ చేశారు మేకర్స్. విశ్వంభర రిలీజ్ అవ్వాల్సిన తేదీకి విడుదల చేస్తున్నారు. గేమ్ ఛేంజర్ కోసమే విడుదల వాయిదా వేస్తున్నట్లు విశ్వంభర మేకర్స్ తెలిపారు. మొత్తానికి ఎన్నో ఏళ్ల నుంచి రామ్ చరణ్ అభిమానులు వెయిట్ చేస్తుండగా.. ఎట్టకేలకు జనవరి 10న ఆయన మూవీ రిలీజ్ కానుంది.

అది బాగానే ఉన్నా .. ఇప్పుడు అనిల్ రావిపూడికి పెద్ద పనే పడిందని టాక్ వినిపిస్తోంది. వెంకటేష్ తో చేస్తున్న సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాలనే ఉద్దేశ్యంతో శరవేగంతో వివిధ షూటింగ్ షెడ్యూల్స్ ను కంప్లీట్ చేశారు ఆయన. కచ్చితంగా పొంగల్ కు రిలీజ్ చేస్తామని కొన్ని రోజుల క్రితం ఒక వీడియోను కూడా రిలీజ్ చేశారు. కానీ ఇప్పుడు గేమ్ ఛేంజర్.. సంక్రాంతికి రానుంది. రెండు చిత్రాలకు దిల్ రాజు నిర్మాత కావడంతో వెంకీ మూవీ వాయిదా పడుతుందని అంతా అనుకుంటున్నారు.

దిల్ రాజు కూడా వెంకటేష్, అనిల్ మూవీనే పోస్ట్ పోన్ చేయాలని నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. కానీ వెంకీ మాత్రం.. సంక్రాంతికి తన సినిమాను రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట. ఇప్పటికే ఆయన నటించిన కలిసుందాం రా, ఎఫ్ 2 వంటి చిత్రాలు పొంగల్ టైమ్ లో వచ్చి బాక్సాఫీస్ వద్ద మంచి హిట్స్ అయ్యాయి. అనిల్ రావిపూడికి కూడా అదే సెంటిమెంట్ ఉంది. సరిలేరు నీకెవ్వరు, ఎఫ్2 చిత్రాలతో ఆయన మంచి హిట్స్ అందుకున్నారు.

కానీ దిల్ రాజు కోసం అనిల్ రావిపూడి వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. అదే సమయంలో వెంకటేష్ ను ఒప్పించమని అనిల్ కు దిల్ రాజు బాధ్యతలు అప్పజెప్పారని టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు అనిల్ రావిపూడి అదే పనిలో ఉన్నారని సమాచారం. ఇప్పటికే వెంకీ, అనిల్ కాంబోలో వ‌చ్చిన ఎఫ్2, ఎఫ్3 చిత్రాలు మంచి విజ‌యాల‌ను అందుకున్నాయి. ఇప్పుడు నాలుగో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మరి వెంకటేష్, అనిల్ రావిపూడి మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి.