నా భార్యకు వీడియోలు పంపి ఏంటి ఇదంతా అని అడుగుతున్నారు: అనిల్ రావిపూడి
రీసెంట్ గా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో సూపర్ సక్సెస్‌ను అందుకున్న అనిల్ రావిపూడి తన తర్వాతి సినిమాను మెగాస్టార్ చిరంజీవితో చేయనున్న విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 1 March 2025 1:52 PM GMTఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన దగ్గర నుంచి అసలు తన కెరీర్లో ఫ్లాపే లేని డైరెక్టర్ గా అనిల్ రావిపూడి మంచి పేరు తెచ్చుకున్నాడు. రీసెంట్ గా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో సూపర్ సక్సెస్‌ను అందుకున్న అనిల్ రావిపూడి తన తర్వాతి సినిమాను మెగాస్టార్ చిరంజీవితో చేయనున్న విషయం తెలిసిందే.
సంక్రాంతికి వస్తున్నాం సక్సెస్‌లో భాగంగా అనిల్ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో తక కెరీర్, సోషల్ మీడియాలో తనపై వస్తున్న వీడియోల గురించి మాట్లాడాడు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన తాను ఈ స్థాయికి రావడం ఎంతో ఆనందంగా ఉందని, వయసుతో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరూ తన సినిమాలను ఎంజాయ్ చేయడం తనకు ఎంతో సంతోషాన్నిస్తుందని అనిల్ తెలిపాడు.
అయితే అనిల్ డైరెక్టర్ అవకముందు పలు సినిమాలకు రైటర్ గా వర్క్ చేశాడు. రైటర్ గా మంచి పేరొచ్చాకే డైరెక్షన్ వైపు అడుగులేశాడు. అలా అని అనుకున్న వెంటనే అనిల్ వెంటనే డైరెక్టర్ అయిపోలేదు. దాని కోసం ముందు మూడేళ్లు ఎన్నో ఇబ్బందులు పడ్డానని, ఆఖరికి కళ్యాణ్ రామ్ తనను నమ్మి పటాస్ ద్వారా తనకు డైరెక్టర్ గా మొదటి ఛాన్స్ ఇచ్చారని చెప్పాడు.
ఫ్యూచర్‌లో ఏదైనా మంచి స్టోరీ ఉన్న సినిమాల్లో ఛాన్స్ వస్తే యాక్ట్ చేస్తానని చెప్తున్న అనిల్ సోషల్ మీడియాలో తనపై వస్తున్న వీడియోలను ఉద్దేశించి మాట్లాడాడు. తన గురించి ఇష్టమొచ్చినట్టు కథలు రాసి, దానికి మంచి వాయిస్ ఓవర్లతో వీడియోలు క్రియేట్ చేస్తున్నారు. ఆ వీడియోలను చూసిన ఫ్యామిలీ మెంబర్స్, చుట్టాలు తన భార్యకు పంపి అనిల్ గురించి అంటున్నారేంటని అడుగుతున్నారని తెలిపాడు.
ఇప్పటికే ఈ విషయంలో తాను సైబర్ పోలీస్ లకు ఫిర్యాదు చేశానని, ఇకనైనా తనపై అలాంటి వీడియోలను చేయకుండా, ఉన్న వీడియోలను తీసేస్తే బావుంటుందని, లేకపోతే పోలీసులే దానికి తగ్గ చర్యలు తీసుకుంటారని అనిల్ హెచ్చరించాడు. తన గురించి మాత్రమే కాకుండా ఎంతోమంది గురించి ఇలా ఇష్టమొచ్చినట్టు రాసేసి ఆ వీడియోలను వైరల్ చేస్తున్నారని, అలాంటి వీడియోల వల్ల ఎంతోమంది ఎన్నోరకాలుగా ఇబ్బందులు పడుతున్నారని, కాబట్టి లేనిపోని వార్తలు రాయొద్దని అనిల్ కోరాడు.