నాని.. రావిపూడి చేయి పడ్డాకే 'అలా మొదలైంది'..
ప్రస్తుతం సక్సెస్ జోష్ లో ఉన్న ఆయన.. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ విషయాన్ని షేర్ చేసుకున్నారు. తాను హీరో నాని మూవీకి వర్క్ చేసినట్లు వెల్లడించారు.
By: Tupaki Desk | 26 Jan 2025 3:30 PM GMTటాలీవుడ్ యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి వరుస విజయాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా సంక్రాంతి వస్తున్నాం మూవీతో సూపర్ హిట్ ను అందుకున్నారు. ప్రస్తుతం సక్సెస్ జోష్ లో ఉన్న ఆయన.. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ విషయాన్ని షేర్ చేసుకున్నారు. తాను హీరో నాని మూవీకి వర్క్ చేసినట్లు వెల్లడించారు.
నందిని రెడ్డి దర్శకత్వంలో నాని.. అలా మొదలైంది సినిమా చేసిన సంగతి విదితమే. నిత్యామీనన్ డెబ్యూ మూవీ అయిన ఆ సినిమా.. సూపర్ హిట్ గా నిలిచింది. నందిని రెడ్డికి కూడా అదే ఫస్ట్ మూవీ. అప్పుడు ఆ ప్రాజెక్టుకు తాను రైటర్ గా ఉన్న సమయంలో వర్క్ చేసినట్లు గుర్తు చేసుకున్నారు రావిపూడి. పలు విషయాలను పంచుకున్నారు.
"నందిని గారి ప్రాజెక్ట్.. అప్పుడు షూట్ కంప్లీట్ ఒక చిన్న ప్రాబ్లం వల్ల ఎడిటింగ్ లో ఆగింది. చాలా మంది వస్తున్నారు.. చూస్తున్నారు.. ఏవో ప్రాబ్లమ్స్ చెబుతున్నారు.. నందిని ఫ్రస్టేషన్ లో ఉన్నారు.. అప్పుడు నేను కూడా వెళ్లా.. తొలిసారి వెళ్లినప్పుడు వీడెవడు ఉన్నట్లు చూశారు.. వీడో కొత్త వాడు వచ్చాడు అన్నట్లు" అని తెలిపారు.
"అయితే నా అంత బాగా సినిమాను ఎవరూ ఎంజాయ్ చేయకపోయి ఉంటారు.. సూపర్బ్ గా ఎంజాయ్ చేశా.. థియేటర్లలో ఆడియన్స్ లా ఎంజాయ్ చేశా.. సీన్స్ అన్నీ పండాయి.. నాని, నిత్యా మీనన్ కాంబో ఫ్రెష్ గా ఉంది. నిత్య హ్యాపీనింగ్ గా ఉంది. సినిమా అంత కొత్తగా ఉందని నందినికి చెప్పా" అని పేర్కొన్నారు.
"అప్పుడు నందిని కళ్లలో ఓ మెరుపు కనిపించింది. వీడేంటీ సినిమా బాగుందని చెబుతున్నాడు అన్నట్లు చూసింది. అప్పటి వరకు వచ్చిన వారంతా పాపం ఎలాంటి ఫీడ్ బ్యాక్ ఇచ్చారేమో.. సీరియస్ గా చెబుతున్నావా అని అడిగింది.. హా అన్నాను. ప్రొడ్యూసర్ కు చెప్పు అనింది.. అలా వెళ్లి చెప్పా" అని అనిల్ తెలిపారు.
"నిర్మాత ముందు కూర్చున్నా.. సినిమాలో పాజిటివ్స్ అన్ని ఉన్నాయా అని వాళ్లు అనుకున్నారు.. 75 డౌట్స్ రాసి ఇచ్చారు. అడిగినవన్నీ క్లియర్ గా చెప్పాను. అప్పుడు ఫైనల్ గా స్క్రీన్ ప్లేలో ప్రాబ్లమ్ ఉందని ఐడియా వచ్చింది. అప్పుడు నాకు వర్క్ చేయమన్నారు. నేను నందిని, నాని గారు స్క్రీన్ ప్లే సెట్ చేశాం" అని వెల్లడించారు.
"ఆ తర్వాత క్లైమాక్స్ కోసం మళ్లీ సెట్స్ కు పిలిచారు. స్క్రీన్ ప్లే విషయంలో డౌట్ ఎక్కడ ఉందో అడిగారు. నేను చెప్పిన టైమింగ్ సెట్ అయింది. నాని, నేను బస్ లో కూర్చున్నాం. మొత్తం 45 మినిట్స్ లో అంతా పూర్తి చేశాం. నందినికి కూడా నచ్చింది. అలా మొదలైంది.. అలా స్పాంటేనియస్ గా జరిగిపోయింది" అని చెప్పారు. ప్రస్తుతం అనిల్ రావిపూడి కామెంట్స్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.