నాన్నలా ఇండస్ట్రీని 50 ఏళ్లు దున్నేస్తానంటోన్న హీరోయిన్!
అనీల్ కపూర్ వారసురాలిగా బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన సోనమ్ కపూర్ సక్సెస్ అయిన వైనం గురించి చెప్పాల్సిన పనిలేదు
By: Tupaki Desk | 19 Aug 2023 5:42 AM GMTఅనీల్ కపూర్ వారసురాలిగా బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన సోనమ్ కపూర్ సక్సెస్ అయిన వైనం గురించి చెప్పాల్సిన పనిలేదు. 'సవారియ్యా'తో ఎంట్రీ ఇచ్చిన సోనమ్ కెరీర్ దేదీప్యమానంగా సాగిపోతుంది. వైవిథ్యమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకుంది. కెరీర్ పీక్స్ లో ఉండగానే వివాహం చేసుకుని సెకెండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తండ్రి జర్నీని గుర్తు చేసుకుని తన జర్నీ ఎలా ఉండాలన్నది రివీల్ చేసింది.
'మానాన్న సినిమాల్లో ఐదు దశాబ్ధాలుగా కొనసాగుతున్నా ఇప్పటికీ అదే ఉత్సాహంతో పని చేస్తున్నారు. సినిమా షూటింగ్ కి వెళ్లే ముందు రోజు మొదటి రోజులాగే ఫీలవుతారు. అందుకే ఆయన నాకు స్పూర్తిగా అయ్యారు. ఓ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కూడా సినిమాల్లో నటించమని ఎంతో ప్రోత్సహించారు. నాన్నని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. నన్ను ఎప్పుడూ ప్రేరేపిస్తూనే ఉంటారు.
నేను కూడా ఆయనలా ఉండాలని కోరుకుంటున్నా. ఎందుకంటే ఆయనలా ఐదు దశాబ్దాల పాటు సినిమాలు చేయాలి అన్న బలమైన కోరిక ఉంది. పిల్లల్ని.. ప్రేక్షకు ల్ని..తొటి నటుల్ని తన కళతో.. నటనతో అలరించి మంచి స్థానాన్ని సొంతం చేసుకున్నారు. నేను కూడా ఆయన మార్గంలోనే సినిమాలు చేయాలనుకుటున్నా. కెమెరా ముందు ఉండి పనిచేస్తుంటే ఏదో తెలియని ఆనందం..అనుభూతికి లోనవుతుంటా.
రాబోయే రెండు సినిమాల కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. నావృత్తిగత జీవితానికి..వ్యక్తిగత జీవితానికి కావాల్సినంత సమయాన్ని కేటాయిస్తున్నా. ఈ విషయంలో నా ప్రణాళిక చాలా పక్కాగా ఉంటుంది. ఇది నాకు నాన్న నుంచి అలవాటు అయింది' అని అన్నారు. 'సవారియా'.. 'ఢిల్లీ-6 '..'రాంజానా'.. 'భాగ్ మిల్కా భాగ్'.. 'ప్రేమ్ రతన్ ధన్ పాయో' లాంటి సినిమాలు సోనమ్ కెరీర్ లో గొప్ప చిత్రాలుగా చెప్పొచ్చు. ఇంకా ఎన్నో హిట్ సినిమాలు చేసింది. అమ్మడి నటనకి ప్రత్యేకమైన అభిమాను లున్నారు. నటన విషయంలో సోనమ్ తండ్రికి తగ్గ తన అనిపిస్తుంది.