Begin typing your search above and press return to search.

డౌట్ అక్కర్లేదు.. అనిల్ రావిపూడికి అది సాధ్యమే!

ఎఫ్‌2, ఎఫ్‌3 సినిమాల తర్వాత వెంకటేష్ తో అనిల్‌ రావిపూడి మరోసారి వర్క్ చేసేందుకు సిద్ధం అయ్యాడు.

By:  Tupaki Desk   |   1 July 2024 5:25 AM GMT
డౌట్ అక్కర్లేదు.. అనిల్ రావిపూడికి అది సాధ్యమే!
X

ఎఫ్‌2, ఎఫ్‌3 సినిమాల తర్వాత వెంకటేష్ తో అనిల్‌ రావిపూడి మరోసారి వర్క్ చేసేందుకు సిద్ధం అయ్యాడు. బ్యాక్ టు బ్యాక్‌ ఫ్లాప్స్ నేపథ్యంలో వెంకటేష్ ఒక పక్కా కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్‌ మూవీ చేయాలని ఎదురు చూస్తున్న సమయంలో అనిల్ రావిపూడి ఒక మంచి వినోదాత్మక కథ తో వచ్చాడని, దాంతో వెంకీ వెంటనే ఓకే చెప్పాడని సమాచారం అందుతోంది.

రెండు మూడు నెలల క్రితమే ఈ సినిమా ప్రకటన వచ్చింది, ఆ సమయంలోనే 2025 సంక్రాంతి కి సినిమా విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు కూడా సినిమా షూటింగ్‌ ప్రారంభం కాలేదు. జులై మాసం లో షూటింగ్‌ అన్నారు. జులై మాసం కూడా మొదలు అయ్యింది.

సినీ వర్గాలు మరియు మీడియా సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం వెంకీ, అనిల్ రావిపూడి కాంబో మూవీ ఆగస్టు మొదటి లేదా రెండో వారంలో మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆగస్టు లో సినిమా మొదలు అయితే షూటింగ్‌ కు చాలా తక్కువ సమయం ఉంటుంది.

కేవలం అయిదు నెలల సమయంలో సినిమా ఎలా పూర్తి చేస్తారు.. అలా చేయడం సాధ్యం కాదు కనుక 2025 సమ్మర్‌ కి సినిమా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని కొందరు భావిస్తున్నారు. కానీ అనిల్‌ రావిపూడి మాత్రం ఎప్పుడు ప్రారంభించినా కూడా వచ్చే సంక్రాంతికి దించడం కన్ఫర్మ్‌ అన్నట్లుగా ధీమాతో ఉన్నాడట.

సంక్రాంతి కలిసి వచ్చింది కనుక ఆ సీజన్‌ ను వదులుకోవద్దని దర్శకుడు మరియు నిర్మాత దిల్‌ రాజు కూడా భావిస్తున్నారు. మరి ఇంకా షూటింగ్‌ ప్రారంభం అవ్వని సినిమాను సంక్రాంతికి విడుదల చేయడం సాధ్యమేనా అంటే... కచ్చితంగా సాధ్యం అంటూ అనిల్ రావిపూడి గురించి తెలిసిన వారు అంటున్నారు.

మహేష్ బాబు వంటి సూపర్‌ స్టార్‌ తోనే సినిమాను తక్కువ సమయంలో పూర్తి చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు. భగవంత్‌ కేసరి సినిమాకు కూడా చాలా తక్కువ వర్కింగ్‌ డేస్‌ ను రావిపూడి వాడుకున్నాడు. కనుక వెంకీ మామ తో చేయబోతున్న సినిమా ను కూడా కేవలం వంద రోజుల లోపులోనే పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి.

వెంకటేష్, అనిల్ రావిపూడి మూవీ ప్రారంభం కావడం ఆలస్యం కానీ.. ఒక్కసారి ప్రారంభం అయితే జెట్‌ స్పీడ్‌ తో షూటింగ్‌ ముగించి సంక్రాంతికి తీసుకు రావడం కన్ఫర్మ్‌ అన్నట్లుగా దిల్‌ రాజు ప్రొడక్షన్‌ హౌస్ కి చెందిన వారు కొందరు అంటున్నారు. కనుక సంక్రాంతికి వెంకీ, అనిల్ రావిపూడి మూవీ రిలీజ్ విషయంలో డౌట్‌ అసలు అక్కర్లేదు.