అనిల్ ఖాతాలో మరో హిట్ పడిందా..?
పటాస్ నుంచి ఈరోజు వచ్చిన భగవంత్ కేసరి వరకు దర్శకుడిగా తన ప్రతిభ చూపిస్తూ హిట్ మేనియా కొనసాగిస్తున్నాడు దర్శకుడు అనిల్ రావిపుడి
By: Tupaki Desk | 19 Oct 2023 11:09 AM GMTపటాస్ నుంచి ఈరోజు వచ్చిన భగవంత్ కేసరి వరకు దర్శకుడిగా తన ప్రతిభ చూపిస్తూ హిట్ మేనియా కొనసాగిస్తున్నాడు దర్శకుడు అనిల్ రావిపుడి. బాలకృష్ణ హీరోగా అనిల్ డైరెక్షన్ లో సినిమా అనగానే అందరు ఇతను కూడా బాలయ్య పంథాలో ఒక మాస్ సినిమా చేస్తాడని అనుకున్నారు. కానీ బాలకృష్ణ మాస్ పంథా ఫాలో అవకుండా తన మార్క్ కామెడీ ఎంటర్టైనర్ ని కాకుండా కొత్తగా ప్రయత్నించాడు. మాస్ కామెడీ కన్నా ఎమోషన్ చాలా మంచి సబ్జెక్ట్ అని దాని మీద భగవంత్ కేసరి సినిమా చేశాడు అనిల్ రావిపుడి.
100 సినిమాలకు పైగా చేసిన బాలకృష్ణకు కొత్త క్యారెక్టరైజేషన్ రాయాలంటే చాలా కష్టతరమైనదే కానీ ఆ విషయంలో జాగ్రత్త పడ్డాడు అనిల్. నేలకొండ భగవంత్ కేసరి పాత్రలో బాలకృష్ణ ఎక్కడ తన ఇదివరకు తాలూకా రిఫరెన్స్ లేకుండా చూసుకున్నాడు. అక్కడే అనిల్ రావిపుడి క్లవర్ నెస్ గుర్తించొచ్చు. అయితే కథ పరంగా అంత కొత్తదనం లేకపోయినా కథనంలో అతని టాలెంట్ చూపించాడు. బాలకృష్ణ క్యారెక్టరైజేషన్, శ్రీలీల బాలయ్య మధ్య సీన్స్ సినిమాను నిలబెట్టేలా చేశాయి.
అందుకే ఈ సినిమాకు మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. రివ్యూస్ కూడా దాదాపు పాజిటివ్ గానే వచ్చాయి. పండుగ సీజన్ కాబట్టి సినిమాకు కలిసి వచ్చే అంశమే అని చెప్పొచ్చు. అయితే సినిమా స్యూట్ షాట్ బ్లాక్ బస్టర్ అని చెప్పడం కష్టం ఎందుకంటే కథ పాత చింతకాయ పచ్చడిలానే అనిపిస్తుంది. దర్శకుడు దాన్ని డీల్ చేసిన విధానం సినిమాను యావరేజ్ గా నిలబెట్టింది.
అంతేకాదు బాలయ్య సినిమా అంటే ఫ్యాన్స్ ఆశించే ఊర మాస్ ఈ సినిమాలో లేదు. భగవంత్ కేసరి పాత్ర ప్రకారంగానే అతని డైలాగ్స్, యాక్షన్ ఉంటుంది. ఇది నందమూరి ఫ్యాన్స్ కే కాదు కామన్ ఆడియన్స్ ని మెప్పిస్తుంది. ఓవరాల్ గా డైరెక్టర్ గా అనిల్ బాలకృష్ణ తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాడనే చెప్పొచ్చు. భగవంత్ కేసరి రొటీన్ స్టోరీ అయినా అనిల్ మార్క్ వెరైటీ ట్రీట్ మెంట్ తో ఓకే అనిపించేశాడు. సో ఈ లెక్కన చూస్తే అనిల్ ఖాతాలో ఈ సినిమా కూడా హిట్ ఖాతాలో పడినట్టే అని చెప్పొచ్చు.