Begin typing your search above and press return to search.

అనిల్ రావిపూడి లెక్క పెరిగింది.. రెమ్యునరేషన్ ఎంత?

ఏకంగా 15 కోట్ల రెమ్యునరేషన్ ని అనిల్ రావిపూడి వెంకీ 76 మూవీ కోసం డిమాండ్ చేశాడంట.

By:  Tupaki Desk   |   12 May 2024 4:20 AM GMT
అనిల్ రావిపూడి లెక్క పెరిగింది.. రెమ్యునరేషన్ ఎంత?
X

వరుసగా ఆరు కమర్షియల్ హిట్స్ తో జోరు మీద ఉన్న టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి. రాజమౌళి తర్వాత ప్రస్తుతం అపజయం ఎరుగని దర్శకుడిగా అనిల్ తన బ్రాండ్ ఇమేజ్ ని కొనసాగిస్తున్నాడు. ప్రేక్షకులు ఎలాంటి అంశాలకి కనెక్ట్ అవుతారనేది అంచనా వేసి వారికి కావాల్సింది ఇవ్వడం ద్వారా అనిల్ రావిపూడి సక్సెస్ లు అందుకుంటాడు.

అతని కథలు అద్భుతంగా ఉంటాయనే అభిప్రాయం లేదు కానీ ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తూ ఉంటుంది. అందుకే కమర్షియల్ డైరెక్టర్ గా అనిల్ రావిపూడి టాలీవుడ్ లో దూసుకుపోతున్నాడు. గత ఏడాది భగవంత్ కేసరి మూవీతో బాలయ్యకి బ్లాక్ బస్టర్ హిట్ ని అనిల్ రావిపూడి అందించాడు. ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ తో హ్యాట్రిక్ హిట్ కొట్టేందుకు సిద్ధం అవుతున్నాడు.

ఇప్పటికే వెంకటేష్ తో ఎఫ్2, ఎఫ్3 సినిమాలతో అనిల్ రావిపూడి సూపర్ హిట్స్ అందుకున్నాడు. అలాగే దిల్ రాజుకి వరుస హిట్స్ ఇచ్చాడు. ఈ ముగ్గురి కాంబినేషన్ లో వెంకీ 76 మూవీకి రంగం సిద్ధం అవుతోంది. ప్రస్తుతం మూవీ ప్రీప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. జూన్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుందనే మాట వినిపిస్తోంది.

మీనాక్షి చౌదరి ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తోందంట. సెకండ్ హీరోయిన్ క్యారెక్టర్ కోసం ప్రస్తుతం చర్చలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం అనిల్ రావిపూడి తీసుకుంటున్న రెమ్యునరేషన్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఏకంగా 15 కోట్ల రెమ్యునరేషన్ ని అనిల్ రావిపూడి వెంకీ 76 మూవీ కోసం డిమాండ్ చేశాడంట.

వరుస సక్సెస్ లు ఉండటంతో పాటు దిల్ రాజుకి ఏకంగా 5 హిట్స్ అనిల్ రావిపూడి ఇచ్చాడు. ఈ నేపథ్యంలో దిల్ రాజు కూడా అనిల్ రావిపూడి డిమాండ్ చేసిన రెమ్యునరేషన్ ఇవ్వడానికి ఒకే చెప్పాడంట. దర్శకుడికి 15 కోట్ల రెమ్యునరేషన్ అంటే భారీగా తీసుకుంటున్నట్లే లెక్క. ప్రస్తుతం ఇండియన్ వైడ్ గా చూసుకుంటున్న టాప్ మాస్ డైరెక్టర్స్ గా ఉంటున్నవారే ఈ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.

ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న డైరెక్టర్స్ జాబితా చూసుకుంటే రాజమౌళి మొదటిస్థానంలో ఉన్నారు. తరువాత సందీప్ రెడ్డి వంగా, ప్రశాంత్ నీల్, రాజ్ కుమార్ హిరానీ, సుకుమార్, సంజయ్ లీలా భన్సాలీ, అట్లీ, లోకేష్ కనగరాజ్, సిద్ధార్ధ్ ఆనంద్, శంకర్ ఉన్నారు. భవిష్యత్తులో ఈ జాబితాలో అనిల్ రావిపూడి కూడా చేరే అవకాశం ఉందనే మాట ప్రస్తుతం వినిపిస్తోంది.