Begin typing your search above and press return to search.

అనిల్ రావిపూడి... సరిలేరు స్టైల్ లోనే

అలాగే వెంకీ76 సినిమాను కూడా 5 నెలలోనే కంప్లీట్ చేయడానికి అనిల్ రావిపూడి ప్లానింగ్ చేసుకున్నారంట.

By:  Tupaki Desk   |   25 July 2024 4:59 AM GMT
అనిల్ రావిపూడి... సరిలేరు స్టైల్ లోనే
X

రాజమౌళి తర్వాత టాలీవుడ్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా అనిల్ రావిపూడి దూసుకుపోతున్నారు. ఆయన నుంచి వచ్చిన సినిమాలు అన్ని కూడా హిట్ అయ్యాయి. ఏకంగా ఏడు కమర్షియల్ సక్సెస్ లు అనిల్ రావిపూడి తన ఖాతాలో వేసుకున్నారు. చివరిగా గత ఏడాది భగవంత్ కేసరి సినిమాతో నందమూరి బాలకృష్ణకి బ్లాక్ బస్టర్ హిట్ అనిల్ రావిపూడి ఇచ్చారు. ఈ సినిమా తర్వాత మరోసారి విక్టరీ వెంకటేష్ తో అనిల్ రావిపూడి జతకట్టారు.

వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పటికే ఎఫ్2, ఎఫ్3 సినిమాలు వచ్చి కమర్షియల్ కామెడీ ఎంటర్టైనర్స్ గా సూపర్ హిట్ అయ్యాయి. ఈ రెండింటిని దిల్ రాజు నిర్మించారు. మరోసారి వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్ కి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం ఈ సినిమా ప్రారంభోత్సవం జరిగింది. విక్టరీ వెంకటేష్ 76 మూవీగా ఈ చిత్రాన్ని స్టార్ట్ చేశారు. ఈసారి అనిల్ రావిపూడి వెంకటేష్ తో క్రైమ్ కామెడీ కథని చెప్పబోతున్నట్లుగా మూవీ అనౌన్స్ పోస్టర్స్ తో కన్ఫర్మ్ అయింది.

మీనాక్షి చౌదరి హీరోయిన్ గా ఈ చిత్రంలో నటిస్తోంది. ఇదిలా ఉంటే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఆగస్టులో ప్రారంభం కాబోతుందని తెలుస్తోంది. విక్టరీ వెంకటేష్ మూవీ ఫస్ట్ షెడ్యూల్ లో జాయిన్ కాబోతున్నారంట. అనిల్ రావిపూడి మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమాని కేవలం ఐదు నెలల్లోనే షూట్ కంప్లీట్ చేసి ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు. అలాగే వెంకీ76 సినిమాను కూడా 5 నెలలోనే కంప్లీట్ చేయడానికి అనిల్ రావిపూడి ప్లానింగ్ చేసుకున్నారంట.

అనిల్ రావిపూడి ఏ సినిమా చేసిన పర్ఫెక్ట్ స్క్రిప్ట్ రెడీ చేసుకుని, మరలా ఎలాంటి మార్పులు చేర్పులు చేయకుండా స్పీడ్ గా షూట్ కంప్లీట్ చేస్తారు. సినిమాలో ఎలాంటి అంశాలు ఉంటే ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు అనేది ఖచ్చితమైన అంచనాలు అనిల్ రావిపూడి ఉన్నాయి. ఆ ఎలిమెంట్స్ అన్నీ కూడా తన కథలో ఉండేలా చూసుకుంటారు. కామెడీ, సెంటిమెంట్ కి అనిల్ రావిపూడి మంచి ప్రాధాన్యత ఇస్తారు. అందుకే ప్రేక్షకులు కూడా ఆయన సినిమాలకి సక్సెస్ లు అందిస్తున్నారు.

వెంకీ, అనిల్ కాంబినేషన్ లో వచ్చిన ఎఫ్2, ఎఫ్3 తరహాలోనే ఈ సినిమా కూడా సూపర్ హిట్ అవుతుందని చిత్ర యూనిట్ కాన్ఫిడెంట్ గా ఉంది. సంక్రాంతికి వస్తున్నాం టైటిల్ లో ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది. వెంకటేష్ ఈ ఏడాది సైంధవ్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. దీంతో తన నుంచి ప్రేక్షకులు కోరుకునే ఎంటర్టైన్మెంట్ తోనే మళ్ళీ రావడానికి రెడీ అవుతున్నాడు.