తనపై కేసు పెట్టిన వారికి నిర్మాత ప్రతి సవాల్
సందీప్ కిషన్ నటించిన `ఊరు పేరు భైరవకోన` ఈ శుక్రవారం విడుదలైంది. బుధ, గురువారాల్లో ప్రీమియర్స్ అనంతరం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చింది.
By: Tupaki Desk | 16 Feb 2024 4:19 AM GMTసందీప్ కిషన్ నటించిన `ఊరు పేరు భైరవకోన` ఈ శుక్రవారం విడుదలైంది. బుధ, గురువారాల్లో ప్రీమియర్స్ అనంతరం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చింది. అయితే సినిమాపై కోర్టులో కేసు నమోదైంది. సెన్సార్ సర్టిఫికేట్ పొందకుండా మేకర్స్ ప్రీమియర్ షోలు ప్రదర్శించారని ఒక చిన్న నిర్మాత ఆరోపించారు. అయితే తమపై కేసులు ఎందుకు పెట్టారో ఊరు పేరు భైరవకోన నిర్మాత అనీల్ సుంకర స్పష్ఠంగా వివరించారు. ఈ కేసులతో నన్ను ఇబ్బంది పెట్టవచ్చు.. కానీ మీరు నన్ను భయపెట్టలేరు! అని కూడా అన్నారు.
తన సినిమాను కొనుక్కుని నష్టపోయిన వ్యక్తి ఇలా చేసారని కూడా అనీల్ సుంకర అన్నారు. నా దగ్గర సినిమా కొన్న వ్యక్తి డబ్బు పోగొట్టుకున్నాడు. అది నా మనసులో ఎప్పుడూ ఉంటుంది. సినిమా నాన్ రిటర్నబుల్ అడ్వాన్స్ ఆధారంగా కొనుగోలు చేసిన అతడికి నేను పరిహారం చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ నైతిక కారణాలతో సహాయం చేయాలనుకున్నాను. ఏదైనా వ్యాపారంలో లాభం నష్టం సర్వసాధారణం. నష్టం వచ్చిందని ఇతరులను నిందించకూడదు. అయితే లాభాల కోసం ఆశించడం సహజం. ఈ కేసులతో మీరు నన్ను ఇబ్బంది పెట్టవచ్చు.. కానీ మీరు నన్ను భయపెట్టలేరు! అని అనిల్ సుంకర అన్నారు.
ఈ కేసులన్నీ `ఏజెంట్` సమస్యలకు సంబంధించినవి. భైరవకోనకు సంబంధించినవి కావు. మరోవైపు ఊరు పేరు భైరవకోన ప్రీమియర్స్ నుండి వచ్చిన స్పందన నిర్మాతలకు ఊపిరులూదింది. ఈ చిత్రంలో సందీప్ కిషన్, వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్ ప్రధాన పాత్రలు పోషించారు. విఐ ఆనంద్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ట్రైలర్ కి అద్భుత స్పందన వచ్చింది.