అమ్మడు అప్పుడే నేషనల్ క్రష బటన్?
లిప్ స్టిక్ ..ఐబ్రోస్..ఐటెక్స్ అన్నీ అద్దేసింది. కురులు మాత్రం అలా ముందుకు గాలికి వదిలేసింది.
By: Tupaki Desk | 8 Jan 2024 9:35 AM GMT'యానిమల్' హిట్ తో తృప్తి డిమ్రి ఎంత ఫేమస్ అయిందో చెప్పాల్సిన పనిలేదు. అప్పటివరకూ మూడు నాలుగు సినిమాలు చేసినా ఏ సినిమా తీసుకురాని గుర్తింపును యానిమల్ తీసుకొచ్చింది. దీంతో ఓవర్ నైట్ లో ఎంతో ఫేమస్ అయింది. ఇప్పుడీ భామ అంటే తెలియని వారు లేరు. యానిమల్ లో నటించిన రష్మికనైనా మర్చిపోతారేమో గానీ తృప్తిని మాత్రం యానిమల్ అభిమానులు అంత ఈజీగా మర్చిపోలేరు.
అందులో అమ్మడు కనిపించింది కాసేపే అయినా కుర్రాళ్లందర్నీ ఊపేసే రోల్ తో సంలచనమవ్వడం అందకు కారణం. ఈ సినిమా విజయంతో అమ్మడికి నెట్టింట పాపులారిటీ అమాంతం పెరిగింది. సోషల్ మీడియా మాధ్యమాల్లో తృప్తి ఫాలోయింగ్ మామూలుగా లేదిప్పుడు. అమ్మడు ఎలాంటి ఫోటో పోస్ట్ చేసిన నెట్టింట వైరల్ సంచలనం అవుతుంది. తాజాగా తృప్తి డిమ్రి మరో కొత్త ఫోటోని ఇన్ స్టాలో షేర్ చేసింది.
అందులో అమ్మడి బ్లాక్ కలర్ షోల్డర్ డిజైన్ లోకి దూరిపోయింది. టాప్ టూ బాటమ్ అంతా డిజైన్ తోనే కవర్ చేసింది. స్కిన్ టోన్ ఎక్కడా కనిపించని డిజైన్ ఇది. నెక్ నుంచి థై స్ వరకూ ఇదే టౌట్ ఫిట్.
అమ్మడు సన్నజాజి సోయగం కావడంతో ఈ డిజైన్ లో మరింత స్పెషల్ గా కనిపిస్తుంది. ఇక ఫేస్ మాత్రం పుల్ మ్యాకప్ తో నింపేసింది. లిప్ స్టిక్ ..ఐబ్రోస్..ఐటెక్స్ అన్నీ అద్దేసింది. కురులు మాత్రం అలా ముందుకు గాలికి వదిలేసింది.
ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఇక బ్యూటీ అందానికి అభిమానులు ఫిదా అవుతున్నారు. అమ్మడిని నేషనల్ క్రష్ బటన్ అంటూ పొగిడేస్తున్నారు. అలాగే లవ్ ప్రపోజల్స్ జోరుగానే కనిపిస్తున్నాయి. లవ్ యూ సోమచ్ అంటూ కుర్రాళ్లంగా ప్రపోజల్స్ భారీగానే వదులుతున్నారు.