Begin typing your search above and press return to search.

యానిమల్ తెలుగు రాష్ట్రాల బిజినెస్ ఎంతంటే?

15 కోట్లకి మూవీ రైట్స్ ని దక్కించుకున్నారు. డిసెంబర్ 1న టాలీవుడ్ లో ఎలాంటి పెద్ద సినిమాలు లేకపోవడంతో భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   28 Nov 2023 4:13 AM GMT
యానిమల్ తెలుగు రాష్ట్రాల బిజినెస్ ఎంతంటే?
X

రణబీర్ కపూర్, రష్మిక మందన కాంబినేషన్ లో సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన యాక్షన్ ప్యాక్డ్ మూవీ యానిమల్ డిసెంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లోకి రాబోతోంది. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా సిద్ధమైన ఈ సినిమాని ఐదు భాషలలో రిలీజ్ చేస్తున్నారు. అయితే హిందీతో పాటు తెలుగులోనే ఈ సినిమాకి ఎక్కువ రీచ్ ఉంది. దీనికి కారణం అర్జున్ రెడ్డి తర్వాత సందీప్ రెడ్డి వంగా నుంచి రాబోతున్న సినిమా కావడం వలనే.

యూత్ అర్జున్ రెడ్డి సినిమాకి ఎంతగా కనెక్ట్ అయ్యారో యానిమల్ మూవీపై క్రియేట్ అవుతోన్న బజ్ చూస్తేనే తెలిసిపోతోంది. హిందీతో మార్కెట్ లో ఏ స్థాయిలో అయితే యానిమల్ సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయో అలాగే తెలుగు రాష్ట్రాలలో కూడా ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా అన్ని భాషలకి సంబందించిన బిజినెస్ డీల్స్ క్లోజ్ అయ్యాయి.

తెలుగు రాష్ట్రాలలో యానిమల్ మూవీ రిలీజ్ రైట్స్ ని దిల్ రాజు సొంతం చేసుకున్నారు. 15 కోట్లకి మూవీ రైట్స్ ని దక్కించుకున్నారు. డిసెంబర్ 1న టాలీవుడ్ లో ఎలాంటి పెద్ద సినిమాలు లేకపోవడంతో భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ లో యానిమల్ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి. ఆడియన్స్ నుంచి అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో పాజిటివ్ రీచ్ కనిపిస్తోంది.

సందీప్ రెడ్డి వంగా అనే బ్రాండ్ మిగిలిన అన్ని చోట్ల పనిపిస్తోంది. అలాగే రష్మిక మందన ఇమేజ్ కూడా తెలుగు రాష్ట్రాలలో ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పించే అవకాశం ఉందనే మాట సినీ విశ్లేషకుల నుంచి వినిపిస్తోంది. అలాగే ట్రైలర్ హై వోల్టేజ్ తో ప్రతి ఒక్కరికి భాగా కనెక్ట్ అయ్యింది. ఈ ట్రైలర్ మూవీకి సాలిడ్ ఓపెనింగ్స్ తీసుకొచ్చే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు.

నైజాం, ఉత్తరాంద్రలో 9 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. మిగిలిన ప్రాంతాలలో ఆరు కోట్ల వ్యాపారం యానిమల్ పైన జరిగింది. ఈ లెక్కన సినిమా 16 కోట్లు కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ అందుకొనే అవకాశం ఉంది. ఫస్ట్ డే 15 కోట్ల గ్రాస్ వస్తుందని అంచనా వేస్తున్నారు. అలాగే మూవీకి పాజిటివ్ టాక్ వస్తే మాత్రం మొదటి నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్ సాధించే అవకాశం ఉంటుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.