Begin typing your search above and press return to search.

'యానిమల్'.. డిలీట్ చేసిన ఆ సీన్ ని ఓటీటీలోనే..

నిజానికి మా పాత్రల మధ్య ఓ కిస్ సీన్ కూడా ఉంటుంది" అని వెల్లడించారు. అంతేకాకుండా ఈ సీన్ ని తనకు సందీప్ రెడ్డి వంగ ఎలా వివరించాడో కూడా చెప్పాడు.

By:  Tupaki Desk   |   14 Dec 2023 3:18 PM GMT
యానిమల్.. డిలీట్ చేసిన ఆ సీన్ ని ఓటీటీలోనే..
X

సందీప్ రెడ్డి వంగా - రణబీర్ కపూర్ కాంబినేషన్ లో వచ్చిన 'యానిమల్' ప్రస్తుతం థియేటర్స్ లో కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. డిసెంబర్ 1న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయిన ఈ మూవీ ఇప్పటికే రూ.700 కోట్లు కొల్లగొట్టింది. సినిమాపై ఎన్ని నెగిటివ్ కామెంట్స్ వచ్చిన అవి కలెక్షన్స్ పై ఎలాంటి ఇంపాక్ట్ చూపలేకపోయాయి. ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తున్న ఈ మూవీకి సంబంధించి థియేటర్స్ లో డిలీట్ చేసిన ఓ సీన్ ని ఓటీటీలో యాడ్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలిసింది.

ఈ విషయాన్ని బాలీవుడ్ యాక్టర్ బాబి డియోల్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఈ ఇంటర్వ్యూలో రణ్ బీర్ పాత్రకు తన పాత్రకు మధ్య బంధం గురించి చెబుతూ.." క్లైమాక్స్ ఫైట్ లో ఇద్దరు సోదరులు ఒకరినొకరు చంపాలని అనుకుంటారు. కానీ వాళ్ల మధ్య ప్రేమ కూడా ఉంది. అందుకే క్లైమాక్స్ ఫైట్ లో బ్యాక్ గ్రౌండ్ లో ప్రేమ గురించిన పాట వస్తుంటే వీళ్లు కొట్టుకుంటూ ఉంటారు. బి ప్రాక్ పాడిన దునియా జనా దేంగే అనే సాంగ్ బ్యాక్ గ్రౌండ్లో వినిపిస్తూ ఉంటుంది.

నిజానికి మా పాత్రల మధ్య ఓ కిస్ సీన్ కూడా ఉంటుంది" అని వెల్లడించారు. అంతేకాకుండా ఈ సీన్ ని తనకు సందీప్ రెడ్డి వంగ ఎలా వివరించాడో కూడా చెప్పాడు." మీరు ఫైట్ చేస్తుంటారు. నువ్వు సడన్ గా కిస్ చేస్తావ్. అయినా వదిలిపెట్టవు. అతడు నిన్ను చంపేస్తాడు" అని సందీప్ చెప్పాడు. ఇద్దరి మధ్య ఒక కిస్ సీన్ ఉంది. కానీ అతడు ఆ సీన్ డిలీట్ చేశాడు. బహుశా ఆ సీన్ నెట్ ఫ్లిక్స్ వెర్షన్ లో చూడొచ్చు అని అన్నాడు.

కాగా యానిమల్ మూవీ నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో రిలీజ్ కానుంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14 లేదా 15 తేదీల్లో ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ ఓటీటీ లోకి అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో బాబీ విలన్ గా అద్భుతమైన పర్ఫామెన్స్ కనబరిచాడు. ఒక్క డైలాగ్ కూడా లేకుండా కేవలం సైగలతోనే వైలెంట్ విలన్ గా అదరగొట్టాడు.

చాలా కాలంగా బాలీవుడ్లో బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న బాబీ డియోల్ కి యానిమల్ రూపంలో భారీ కం బ్యాక్ దక్కడం విశేషం. యానిమల్ సక్సెస్ తో బాబీ డియోల్ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. దాంతో ఈ బాలీవుడ్ యాక్టర్ కి వరుస అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికే తెలుగులో పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తున్న బాబి డియోల్ తాజాగా బాలయ్య - బాబి నామినేషన్ లో తెరకెక్కుతున్న 'NBK 109' మూవీలో విలన్ రోల్ చేస్తున్నట్లు సమాచారం.