Begin typing your search above and press return to search.

యానిమల్.. అంటే అది నిజం కాదా..

కాగా ఈ మూవీ రిలీజ్ అయి పది రోజులైనా తర్వాత సినిమాలో ఈ ఫైట్ ఒరిజినల్ కాదని, ఓ మలయాళ సినిమా నుంచి స్ఫూర్తి పొందిందని కొందరు నెటిజన్స్ వీడియోలతో సహా బయటపెట్టారు.

By:  Tupaki Desk   |   12 Dec 2023 12:46 PM GMT
యానిమల్.. అంటే అది నిజం కాదా..
X

బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన 'యానిమల్' బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఇప్పటికే రూ.700 కోట్ల మార్క్ అందుకున్న ఈ మూవీ ఇప్పుడు రూ.1000 కోట్ల వైపు పరుగులు తీస్తోంది. సినిమాలో మెయిన్ హైలెట్స్ లో ఇంటర్వెల్ బ్లాక్ ఫైట్ కూడా ఒకటి. రణ్ బీర్ కపూర్ ఉన్న హోటల్ కి కొందరు దుండగులు మొహాలు కనిపించకుండా స్టీల్ మాస్కులు లాంటివి వేసుకొచ్చి గొడ్డలితో చంపబోతే రివర్స్ లో రణ్ బీర్ గోడ మీదున్న అద్దం షోకేస్ పగలగొట్టి అందులో నుంచి ఆయుధం తీయడం, అక్కడి నుంచి విలన్స్ ను నరికి చంపడంతో రక్తపాతం ఏరులైపాడుతుంది.

రణ్ బీర్ అలా నరుకుతున్నప్పుడు బ్యాగ్రౌండ్ లో వచ్చే అర్జన్ వైలీ సాంగ్ గురించి అయితే ఎంత చెప్పినా తక్కువే. బ్యాక్ గ్రౌండ్ లో. సాంగ్ వస్తుండగా రణ్ బీర్ చేసే ఫైట్ సీన్ థియేటర్స్ లో గూస్ బంప్స్ తెప్పించింది. కాగా ఈ మూవీ రిలీజ్ అయి పది రోజులైనా తర్వాత సినిమాలో ఈ ఫైట్ ఒరిజినల్ కాదని, ఓ మలయాళ సినిమా నుంచి స్ఫూర్తి పొందిందని కొందరు నెటిజన్స్ వీడియోలతో సహా బయటపెట్టారు.

2010లో 'నాయకన్' పేరుతో ఓ మలయాళ చిత్రం వచ్చింది. ఇందులో ఇంద్రజిత్ సుకుమారన్ హీరో. కథాకళి కళాకారుడైన తన తండ్రి ఒక రాజకీయ నాయకుడి హత్యను చూసిన కారణంగా డాన్ చేతిలో కూతురితో సహా ప్రాణాలు కోల్పోతాడు. కుటుంబానికి, కళకు దూరంగా ఉన్న కొడుకుకు ఈ విషయం తెలిసి ప్రతీకార కోసం వెనక్కి వచ్చి చంపడం మొదలు పెడతాడు. అలా క్లైమాక్స్ లో విలన్ డెన్ కి వెళ్ళినప్పుడు జరిగే యాక్షన్ బ్లాక్ అచ్చు గుద్దినట్లు యానిమల్ తరహా లోనే ఉంటుంది.

అప్పట్లో మలయాళంలో వచ్చిన నాయకన్ మంచి సక్సెస్ అందుకుంది. ఈ మూవీ తెలుగులో డబ్ లేదా రీమేక్ చేయడం జరగలేదు. అటు హిందీలోనూ రిలీజ్ అవ్వలేదు. అందుకే ఇది ఎవరికి తెలిసే అవకాశం లేదు. విచిత్రం ఏంటంటే రెండు సినిమాల్లోనూ తండ్రి మీద జరిగిన దాడులకు కొడుకులు ప్రతీకారం తీర్చుకోవడమే. దీంతో ఈ రెండిటిని పక్క పక్కనే పెట్టి మరి పోలికలు చూపిస్తున్నారు.

నిజానికి నాయకన్ మూవీ కూడా మరీ ఒరిజినల్ ఏం కాదు.ఆ మూవీ కూడా హాలీవుడ్ నుంచి స్ఫూర్తి పొందిందే. ఇప్పుడున్న టెక్నాలజీ ప్రపంచంలో ఇవన్నీ మామూలే. ఒక సినిమాలో ఉన్న సీన్ మరో సినిమాలో కనిపించడం యాదృచ్ఛికమో, స్ఫూర్తి పొందడమో అనే విషయాన్ని పక్కన పెడితే సందీప్ మేకింగ్ తో ఆ ఫైట్ సీన్ యానిమల్ మూవీకే మెయిన్ హైలెట్గా నిలిచింది.