యానిమల్.. మహేష్ మరీ ఇంత మౌనమా?
అయితే ఇటీవల సపోర్ట్ చేసిన యానిమల్ పై మాత్రం మహేష్ ఎందుకు ఆ రేంజ్ లో ఇప్పటివరకు సరైన రెస్పాన్స్ ఇవ్వలేదు అని కామెంట్స్ అయితే గట్టిగానే వస్తున్నాయి.
By: Tupaki Desk | 13 Dec 2023 6:49 AM GMTసూపర్ స్టార్ మహేష్ బాబు తనకు సినిమా నచ్చితే సోషల్ మీడియాలో వెంటనే తనదైన శైలిలో రివ్యూ ఇస్తూ ఉండడం చాలా కాలంగా నడుస్తోంది. తనుకు ఎలాంటి సంబంధం లేకపోయినా సినిమాలకు కూడా ఆయన గతంలో ప్రశంసలు కురిపించారు. మంచి గుర్తింపు పొందుకున్న చిన్న సినిమాలపై కూడా సూపర్ స్టార్ ఒక రేంజ్ లో పొగుడుతూ ఉంటారు. అయితే ఇటీవల సపోర్ట్ చేసిన యానిమల్ పై మాత్రం మహేష్ ఎందుకు ఆ రేంజ్ లో ఇప్పటివరకు సరైన రెస్పాన్స్ ఇవ్వలేదు అని కామెంట్స్ అయితే గట్టిగానే వస్తున్నాయి.
సందీప్ రెడ్డివంగా మొదటి సినిమా అర్జున్ రెడ్డి టైంలో సినిమా చూసి ప్రశంసలు కురిపించిన మహేష్ బాబు ప్రత్యేకంగా పిలిపించుకొని మరి మాట్లాడాడు. ఆ సినిమా చూసిన తర్వాత కూడా అతనితో వర్క్ చేయాలని అనుకున్నాడు. కానీ మహేష్ బాబు సాఫ్ట్ ఇమేజ్‌కు సందీప్ రెడ్డి స్టోరీ సెట్ కాలేదు. ఒక విధంగా యానిమల్ సినిమా మహేష్ రిజెక్ట్ చేస్తేనే బాలీవుడ్ కి వెళ్ళింది అని చాలా రకాల గాసిప్స్ వచ్చాయి.
ఏది ఏమైనా సందీప్ రెడ్డి పై మాత్రం మహేష్ బాబుకు మంచి అభిప్రాయమే ఉంది. అందుకే పిలవగానే ఈవెంట్ కు కూడా వచ్చాడు. దాంతోనే సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి ఓపెనింగ్స్ వచ్చాయని చెప్పవచ్చు. అయితే ఈ సినిమా విడుదలైన తర్వాత మహేష్ బాబు ఎలా రియాక్ట్ అవుతాడు అని అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూశారు. కానీ మహేష్ నుంచి కనీసం ఒక చిన్న కామెంట్ కూడా రాకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది.
సినిమాను అయితే సైలెంట్‌గా చూసిన మహేష్ ప్రత్యేకంగా సందీప్ తో ఫోన్లో మాట్లాడినట్లుగా తెలుస్తోంది. రాజమౌళి కూడా దాదాపు అదే తరహా లో ఫాలో అయినట్లు ఇండస్ట్రీలో వినిపిస్తున్న మాట. అయితే మహేష్ మౌనంగా ఉండడానికి కారణం ఈ సినిమాలోని సెన్సిటివ్ సీన్స్ పై వస్తున్న అభిప్రాయాలు. ముఖ్యంగా హీరోయిన్ క్యారెక్టర్ తో పాటు ఇతర లేడీ క్యారెక్టర్స్ ను కూడా దర్శకుడు చాలా తక్కువ స్థాయిలో చూపించారు అనేలా కామెంట్స్ కూడా వచ్చాయి.
అలాగే మరికొన్ని సీన్స్ మరి క్రూరత్వంగా ఉన్నాయని కూడా అభిప్రాయాలు వస్తున్నాయి. ఈ తరుణంలో మహేష్ ఈ సినిమా గురించి ఏమాత్రం పొగిడినా కూడా కామెంట్స్ ఏ విధంగా ఉంటాయో ఊహించడం కష్టమే. అయితే ఈ విషయంలో అల్లు అర్జున్ మాత్రం ఒక అడుగు ముందుకు వేసి తనదైన చలిలో రివ్యూ ఇచ్చాడు. ఇక మహేష్ మాత్రం అంత ధైర్యం చేయలేకపోయాడు. గతంలో మేమ్ ఫేమస్ అనే సినిమాను మరి ఎక్కువ పొగిడేశాడు మహేష్. ఆ సినిమా నిర్మాతలు మహేష్ కు చాలా క్లోజ్ అయినప్పటికీ ఆ రేంజ్ లో పొగిడేయడం కాస్త రివర్స్ అయింది. అప్పటి నుంచి మహేష్ ఏ సినిమాకు పెద్దగా రివ్యూలు ఇవ్వడం లేదు. కానీ నచ్చితే మాత్రం ప్రత్యేకంగా ఫోన్ చేసి సినిమాలపై ప్రశంసలు కురిపించినట్లు తెలుస్తోంది.