Begin typing your search above and press return to search.

యానిమల్‌ : అది VFX కాదట, ఒరిజినల్‌ గా చేశారట

తెలుగు దర్శకుడు, సౌత్‌ హీరోయిన్ అవ్వడంతో ఒక తెలుగు సినిమా కోసం ఎదురు చూసినట్లుగానే టాలీవుడ్‌ ప్రేక్షకులు ఈ సినిమా కోసం వెయిట్‌ చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   27 Nov 2023 11:30 AM GMT
యానిమల్‌ : అది VFX  కాదట, ఒరిజినల్‌ గా చేశారట
X

హిందీ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులు ఇంకా ఇతర సౌత్‌ ఇండియన్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం 'యానిమల్‌'. ఈ సినిమా డిసెంబర్‌ 1న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. తెలుగు దర్శకుడు, సౌత్‌ హీరోయిన్ అవ్వడంతో ఒక తెలుగు సినిమా కోసం ఎదురు చూసినట్లుగానే టాలీవుడ్‌ ప్రేక్షకులు ఈ సినిమా కోసం వెయిట్‌ చేస్తున్నారు.

సినిమాకు సంబంధించిన ప్రతి విషయం కూడా చాలా ఆసక్తి ని రేకెత్తిస్తున్నాడు. హీరోలు బాలీవుడ్‌ లో సత్తా చాటారు కానీ, మన దర్శకులు పెద్దగా అక్కడ సత్తా చాట లేక పోతున్నారు. సందీప్ వంగ అర్జున్‌ రెడ్డితో హిట్‌ కొట్టి ఈ సినిమా తో మరో విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయం అన్నట్లుగా అంతా ధీమాతో ఉన్నారు. ట్రైలర్‌ విడుదల తర్వాత అంచనాలు పెరిగాయి.

ట్రైలర్‌ లో రణబీర్ కపూర్‌ ఒక భారీ మెషిన్ గన్ తో ఫైర్ చేయడం మనం చూశాం. కేజీఎఫ్ సినిమాలో ఒక మోస్తరు మెషన్ గన్‌ కే అంతా కూడా అవాక్కయ్యారు. అలాంటిది అంతకు రెండు మూడు రెట్లు పెద్దగా ఉన్న యానిమల్‌ మెషన్ గన్ చూసి అంతా కూడా అవాక్కయ్యారు. అయితే చాలా మంది ఆ గన్‌ ను వీఎఫ్‌ఎక్స్ ద్వారా క్రియేట్‌ చేశారేమో అనుకుంటున్నారు.

తాజాగా యానిమల్‌ సినిమాకు ఆర్ట్‌ డైరెక్టర్‌ గా చేసిన సురేష్ సెల్వరాజన్‌ ఆ గన్‌ గురించి మాట్లాడాడు. ఆ గన్‌ ను వీఎఫ్‌ఎక్స్ క్రియేషన్ కాదు. నాలుగు నెలలు కష్టపడి ఒరిజినల్‌ స్టీల్‌ తో తయారు చేశాం. ఆ మెషిన్ గన్ ను తయారు చేయడం కోసం మేము దాదాపుగా 500 కేజీల స్టీల్‌ ను వినియోగించాం అంటూ సురేష్ సెల్వరాజన్‌ షాకింగ్‌ విషయాన్ని చల్లగా చెప్పాడు.

సాధారణంగా ధర్మకోల్‌ లేదా, చెక్కలతో కూడా తాత్కాలికంగా గన్‌ లను తయారు చేయవచ్చు. కానీ రియాల్టీ రావాలి అనే ఉద్దేశ్యంతో రియల్‌ గా స్టీల్‌ తో తయారు చేశామని ఆయన పేర్కొన్నారు. ఆ సన్నివేశాలను చిత్రీకరించిన సమయంలో దర్శకుడు సందీప్ మరియు హీరో రణబీర్‌ కపూర్ లు చాలా ఎగ్జైట్‌ అయ్యారని కూడా సెల్వరాజన్‌ అన్నారు.