ఆ మెషీన్‌గన్ తయారీ అంత సులువేమీ కాదు!
ఇది తయారు చేసిన మెషిన్ గన్ అని ప్రొడక్షన్ డిజైనర్ కం కళాదర్శకుడు సురేష్ సెల్వరాజన్ వివరాలను వెల్లడించారు.
By: Tupaki Desk | 20 Dec 2023 3:58 AM GMTరణబీర్ -సందీప్ రెడ్డి వంగా క్రైమ్ థ్రిల్లర్ 'యానిమల్' బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించింది. ఈ సినిమా తొలి 20రోజుల్లో 800కోట్లు పైగా వసూలు చేసింది. యాక్షన్ సీక్వెన్స్‌లు నటీనటుల అద్భుతమైన ప్రదర్శనకు ప్రేక్షకులు సినిమాని మెచ్చుకున్నారు. ఇక ఈ సినిమాలో ఒక అద్భుతమైన యాక్షన్ బ్లాక్ గురించి పదే పదే ప్రజలు మాట్లాడుకుంటున్నారు. రణబీర్ కపూర్ చేతితో భారీ మెషీన్ గన్ బుల్లెట్లు కురిపిస్తుంటే థియేటర్లు దద్దరిల్లాయి. అయితే ఇది నిజమైన మెషీన్ గన్ యేనా? అని ప్రశ్నిస్తున్నవారికి తాజాగా సమాధానం లభించింది.
అయితే ఇది నిజమైన మెషీన్ గన్ అని కళాదర్శకుడు సురేష్ సెల్వరాజన్ వెల్లడించారు. ఇది తయారు చేసిన మెషిన్ గన్ అని ప్రొడక్షన్ డిజైనర్ కం కళాదర్శకుడు సురేష్ సెల్వరాజన్ వివరాలను వెల్లడించారు. ఈ మెషీన్ గన్ ని పూర్తి చేయడానికి నాలుగు నెలలు పట్టిందని తెలిపారు. భారీ యాక్షన్ సన్నివేశంలో విస్మయం కలిగించే మెషిన్ గన్ నిజానికి CGI లో సృష్టించిన ఉత్పత్తి కాదని నిజమైన మెషీన్ గన్ అని వెల్లడించారు.
సుమారు 500 కేజీల వార్ మెషిన్ గన్ పూర్తిగా నిజమైన స్టీల్‌తో హ్యాండ్‌క్రాఫ్ట్ చేసినట్లు వెల్లడించారు. ఇది పూర్తి చేయడానికి నాలుగు నెలల సమయం పట్టిందని అన్నారు. ఈ చిత్రంలో 18 నిమిషాల పాటు సాగే భారీ యాక్షన్ సీక్వెన్స్‌లో ఈ గన్ ని ఉపయోగించారు. ఇలాంటి గన్ ని ఏ భారతీయ చిత్రంలోను చూపించలేదు. ఇది సందీప్ (దర్శకుడు) దృష్టి కోణం నుంచి పుట్టినది అని వెల్లడించారు.
మెషీన్ గన్‌తో వాస్తవికత కనిపించేలా యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించడంలో ఎదురయ్యే సవాళ్ల గురించి ఇంతకుముందు రణబీర్ కపూర్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఒక మంచి ప్రామాణికతతో మెషీన్ గన్ రూపొందించారని, సినిమాలో ఆ యాక్షన్ బ్లాక్ హైలైట్ అయిందని వెల్లడించారు.