Begin typing your search above and press return to search.

యానిమాల్.. ఆ సీన్ ఎగిరిపాయే..

సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన యానిమల్ సినిమా మొదటిరోజు బాక్సాఫీస్ వద్ద ఊహించని స్థాయిలో కలెక్షన్స్ సొంతం చేసుకుంది.

By:  Tupaki Desk   |   2 Dec 2023 7:50 AM GMT
యానిమాల్.. ఆ సీన్ ఎగిరిపాయే..
X

సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన యానిమల్ సినిమా మొదటిరోజు బాక్సాఫీస్ వద్ద ఊహించని స్థాయిలో కలెక్షన్స్ సొంతం చేసుకుంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ ఏడాది బెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్న సినిమాల్లో ఒకటిగా నిలిచిన యానిమాల్ ఇటు సౌత్ ఇండస్ట్రీలో కూడా అంతకుమించి అనేలా ఇంపాక్ట్ చూపించడం విశేషం.

ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మీడియం రేంజ్ హీరోలకు దీటుగా కలెక్షన్స్ అందుకోవడం ఆశ్చర్యనే కలిగిస్తోంది. ఇక నటుడిగా ప్రతి సన్నివేశంలోనూ రణబీర్ మిగతా యాక్టర్స్ ను డామినేట్ చేస్తూ వచ్చాడు. దర్శకుడు సందీప్ పూర్తిస్థాయిలో రణబీర్ టాలెంట్ ను వాడుకున్నాడు. కేవలం రొమాంటిక్ సన్నివేశాల్లోనే కాకుండా యాక్షన్ ఎపిసోడ్స్ లోనూ అతను చూపించిన షేడ్స్ ఇందులో బాగా వర్క్ అవుట్ అయ్యాయి.

అయితే సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ తోనే ఈ సినిమాను మొదటి రోజు చూడాలి అని ఓ వర్గం ఆడియెన్స్ డిసైడ్ అయ్యారు. దర్శకుడు సందీప్ రెడ్డివంగా ట్రైలర్ నుంచి పాటల వరకు అన్నీ కూడా సినిమాపై హైప్ క్రియేట్ అయ్యే విధంగా జాగ్రత్తలు తీసుకున్నాడు. అయితే ఒక కీలకమైన సన్నివేశం లేకపోవడం మాత్రం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది

పాపా మేరీ జాన్(నాన్నా నువ్వే ప్రాణం) పాట లిరికల్ వీడియో విడుదల చేసినప్పుడు అందులో ఒక చోట రన్బీర్ కపూర్ తాగేసి విమానంలో డ్రైవింగ్ కంట్రోల్ తన చేతిలోకి తీసుకుంటాడు. తన సిక్కు గ్యాంగ్ చూస్తుండగా అతను అలా చేస్తుంటే.. అప్పుడు బ్యాక్ గ్రౌండ్ స్కోర్, హీరో ఎక్స్ ప్రెషన్లు బాగా హైలెట్ అయ్యాయి. వెండితెర పై ఈ సీన్ ఎలా ఉంటుందో అని ఓ వర్గం ఫ్యాన్స్ థియేటర్ లో చూడగా అసలు అది ఎక్కడ లేకపోవడం షాక్ అయ్యారు.

అసలు సందీప్ అంత మంచి సన్నివేశాన్ని ఎందుకు తీసేసాడు అనే విధంగా ఇప్పుడు సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తూ ఉన్నాయి. దాన్ని తీసే బదులు ఫస్ట్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు అలాగే సెకండ్ హాఫ్ లో హీరోయిన్ కు సంబంధించిన మరికొన్ని సన్నివేశాలు తొలగిస్తే సరిపోయేది అనేలా కూడా అభిప్రాయాలు వస్తూ ఉన్నాయి. మరి ఈ విషయంలో దర్శకుడు సందీప్ రెడ్డి ఇంటర్వ్యూలలో ఏమైనా స్పందిస్తాడో లేదో చూడాలి.