Begin typing your search above and press return to search.

హై వోల్టేజ్ యానిమాల్.. ఇద్దరికి అవసరమే..

అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేశాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ.

By:  Tupaki Desk   |   8 Nov 2023 8:56 AM GMT
హై వోల్టేజ్ యానిమాల్.. ఇద్దరికి అవసరమే..
X

అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేశాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. ఒక్క సినిమాతోనే నార్త్ లో సౌత్ లో అతని పేరు మారు మ్రోగిపోయింది. తమిళంలో కూడా అతనికి రీమేక్ చేసే ఆఫర్ వచ్చినప్పటికీ చేయలేకపోయాడు. ఇక ఇప్పుడు యానిమల్ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ అందుకోవాలని ఫిక్స్ అయ్యాడు.

ఈ సినిమాలో బాలీవుడ్ టాలెంటెడ్ హీరో రణబీర్ కపూర్ హీరోగా నటించాడు. ఇక ఈ కాంబినేషన్ పై అంచనాలు అయితే మామూలుగా లేవు. సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ నుంచి మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసుకున్నారు. ఇక ఎప్పటికప్పుడు ఏదో ఒక అప్డేట్ తో బజ్ తగ్గకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇక ఈ కాంబినేషన్ తో దర్శకుడు అలాగే హీరో ఒకరి ద్వారా మరొకరు లాభ పడే అవకాశం ఉంది.

మొదటి సినిమా అర్జున్ రెడ్డి ప్రేమ కథ అయినప్పటికీ హీరోను చాలా పవర్ఫ్ గా చూపించిన దర్శకుడు ఇప్పుడు అంతకుమించి అనేలా యాక్షన్ లో రణబీర్ కపూర్ ను చూపించబోతున్నట్లు అర్థమవుతుంది. ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు ఒక ప్రేమ కథ అలాగే క్రైమ్ యాక్షన్ కూడా ఉండబోతున్నట్లు టీజర్ తో క్లారిటీ ఇచ్చారు.

రణబీర్ కపూర్ తన ప్రతి ఇంటర్వ్యూలో కూడా సందీప్ రెడ్డి టాలెంట్ గురించి ఏదో ఒక కొత్త విషయాన్ని చెబుతూనే ఉన్నాడు. ఇక సందీప్ కూడా హీరోని యాక్టింగ్ స్కిల్స్ గురించి కొత్త విషయాలు మాట్లాడుతున్నాడు. ఏదేమైనప్పటికీ కూడా ఈ కాంబినేషన్ అనేది చాలా క్రేజీగా ఉంది. డైరెక్టర్ హీరోకు పర్ఫెక్ట్ కెమిస్ట్రీ సెట్టయితేనే సినిమాలో ఏదైనా సరే వర్కౌట్ అవుతుంది.

ఇక షూటింగ్ సెట్స్ లో కూడా ఇద్దరూ అంతే బలంగా ఉన్నట్లుగా కాన్ఫిడెంట్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక సందీప్ రెడ్డి బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా సక్సెస్ అందుకొని అక్కడ బిజీగా మారాలి అని చూస్తున్నాడు. ఇక మరోవైపు హీరో రణబీర్ కపూర్ సౌత్ ఇండస్ట్రీ మార్కెట్ పై కూడా పట్టు సాధించాలనే ఆలోచనలో ఉన్నాడు. యానిమల్ సినిమాతో సందీప్ రెడ్డి ద్వారా తెలుగులో అతనికి మంచి మార్కెట్ క్రియేట్ అవుతుంది అని నమ్మకంతో ఉన్నాడు. మరి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.