Begin typing your search above and press return to search.

‘యానిమ‌ల్‌’ లో గృహ‌హింస‌.. క‌నిక‌రించ‌ని బ్రిటీష్ సెన్సార్

రణబీర్ కపూర్ - రష్మిక మందన్న జంట‌గా నటించిన `యానిమల్` 2023లో మోస్ట్ అవైటెడ్ చిత్రాలలో ఒకటి.

By:  Tupaki Desk   |   27 Nov 2023 3:42 AM GMT
‘యానిమ‌ల్‌’ లో గృహ‌హింస‌.. క‌నిక‌రించ‌ని బ్రిటీష్ సెన్సార్
X

రణబీర్ కపూర్ - రష్మిక మందన్న జంట‌గా నటించిన `యానిమల్` 2023లో మోస్ట్ అవైటెడ్ చిత్రాలలో ఒకటి. ఈ చిత్రంలో అనిల్ కపూర్‌, బాబీ డియోల్ కూడా కీలక పాత్రల్లో న‌టించారు. ట్రైలర్ విడుదలైన తర్వాత సినిమాకు సంబంధించిన బజ్ రెట్టింపు అయ్యింది. డిసెంబ‌ర్ 1న ఈ చిత్రం ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌వుతోంది. ఇప్ప‌టికే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) నుండి A రేటింగ్ పొందిన సంగ‌తి తెలిసిందే.

ఇప్పుడు బ్రిటిష్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ క్లాసిఫికేషన్ (BBFC) A రేటింగ్ ను ఇచ్చింది. బ్రిటీష్ బోర్డ్ సైట్ లో దీని గురించి వివ‌ర‌ణ కూడా ఉంది. లైంగిక- గృహ హింసకు సంబంధించిన స‌న్నివేశాలు సహా తీవ్రమైన హింసను ఈ సినిమాలో చూపించారు. అందుకే `యానిమల్` బ్రిటిష్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ క్లాసిఫికేషన్ ద్వారా A రేటింగ్ పొందింది.

ఈ హిందీ భాషా యాక్షన్ డ్రామా ప్రతీకారం కోసం నికరంలేని హింస‌ను తెర‌పై ఆవిష్క‌రిస్తోంది. పోరాట సన్నివేశాలు భయంకరంగా క‌నిపిస్తున్నాయి. గృహహింస‌, దుర్వినియోగం, లైంగిక వేధింపుల వివిక్త క్షణాలు ఉన్నాయి. ``ఒక వ్యక్తి మరొకరి గొంతుపై కత్తిని ఉపయోగిస్తాడు. ఇద్దరు ఖైదీలను హత్య చేయడానికి ఒక వ్యక్తి మాంసం క్లీవర్లను ఉపయోగిస్తాడు. ఉన్మాదంగా కత్తిపోట్లు ఉన్నాయి. మహిళలు, పిల్లలను కొట్టడం, అవమానించడం, బలవంతం చేయడం, తారుమారు చేయడం వంటి అనేక గృహ హింస దృశ్యాలు ఉన్నాయి. ఫైట్ సన్నివేశాలు - తుపాకులు, బ్లేడ్లు, పిడిగుద్దుల‌ను ఉపయోగించారు. రక్తపాతం అధికంగా ఉంది.. అని రాసారు.

యానిమ‌ల్ టీమ్ రిలీజ్ ముందు ప్ర‌చారంలో దూసుకుపోతోంది. నవంబర్ 27న హైదరాబాద్‌లో యానిమ‌ల్ ప్ర‌మోష‌న్స్ కార్య‌క్ర‌మానికి సూప‌ర్ స్టార్ మహేష్ బాబు హాజరు కానున్నార‌ని స‌మాచారం. భూషణ్ కుమార్, రణబీర్, బాబీ డియోల్, అనిల్ కపూర్, రష్మిక మందన్న, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కూడా ఈ కార్య‌క్ర‌మానికి హాజరు కానున్నారు. ఇదిలా ఉంటే, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన యానిమల్ 1 డిసెంబర్ 2023న థియేటర్లలోకి రానుంది.