'యానిమల్'.. పెద్ద రిస్కే
ఇటీవలే యానిమల్ మూవీటీమ్ ఇండిపెండెన్స్‌ను డే రిలీజ్ అవ్వాల్సిన సినిమాను పోస్ట్ పోన్ చేస్తూ.. కొత్త విడుదల తేదీని ప్రకటించింది
By: Tupaki Desk | 27 July 2023 7:15 AM GMTప్రస్తుతం దేశవ్యాప్తంగా సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా 'యానిమల్'. అర్జున్‌రెడ్డి, కబీర్ సింగ్ వంటి గ్రాండ్ హిట్స్ తర్వాత సందీప్ వంగా దర్శకత్వంలో రానున్న చిత్రమిది. అలాగే బ్రహ్మాస్త్ర వంటి భారీ హిట్ తర్వాత రణ్‌బీర్ కపూర్ హీరోగా ఇది రానుంది. దీంతో ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొంది. అయితే ఈ చిత్రం ఓ తప్పుడు నిర్ణయం తీసుకున్నట్లు అంతా అంటున్నారు. ఆ నిర్ణయంపై వెనక్కి తగ్గితే బాగుంటుందని చెబుతున్నారు.
ఇంతకీ అసలేం జరిగిందంటే.. ఇటీవలే యానిమల్ మూవీటీమ్ ఇండిపెండెన్స్‌ను డే రిలీజ్ అవ్వాల్సిన సినిమాను పోస్ట్ పోన్ చేస్తూ.. కొత్త విడుదల తేదీని ప్రకటించింది. డిసెంబర్‌కు వాయిదా వేస్తూ ఓ వీడియోను షేర్ చేసింది. అయితే ఇండియన్ బాక్సాఫీస్‌కు ఇండిపెండెన్స్ డే రిలీజ్ సినిమాలు ఎంతో కీలకంగా వ్యవహరిస్తుంటాయి. ఆ రోజు పబ్లిక్ హాలీడే అవ్వడం వల్ల సినిమాలకు వెళ్లడానికి ప్రేక్షకులు ఎక్కువగా ఆసక్తి చూపుతారు.
మరి అలాంటి తేదీ నుంచి పక్కకు తప్పుకోవడం కరెక్ట్ కాదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇదే సమయంలో స్వాతంత్ర్య దినోత్సవం రోజున బాలీవుడ్లో మరో రెండు చిత్రాలు రిలీజ్ కానున్నాయి. అవే సీనియర్ హీరోలు సన్నీడియోల్ నటించిన 'గద్దర్ 2', అక్షయ్ కుమార్ 'ఓమైగాడ్ 2'. ఈ రెండు చిత్రాలు సీక్వెల్స్ కావడం మరో విశేషం. ఈ సినిమాల మొదటి భాగాలు అప్పట్లో భారీ సక్సెస్‌లను అందుకున్నాయి. కానీ ఇప్పుడా హైప్.. సీక్వెల్స్‌లో కనపడం లేదు.
తాజాగా 'గద్దర్ 2' ట్రైలర్ విడుదలైంది. కానీ అది ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి. అలాగే 'ఓమైగాడ్ 2' చిత్ర కథ హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ఉందంటూ సెన్సార్ సమస్యలను ఎదుర్కొంటోంది.
మరోవైపు ఈ చిత్రం ప్రమోషన్స్‌ను కూడా మొదలుపెట్టలేదు. ఒకవేళ ఈ చిత్రం మరో రెండు మూడు రోజుల్లో సెన్సార్ సమస్యలను పరిష్కరించుకోలేకపోతే..సినిమా పోస్ట్ పోన్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఒకవేళ రిలీజైన డౌటే.
అంటే ఇండిపెండెన్స్‌కు వచ్చే ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు. మరి ఇలాంటి సమయంలో సందీప్ వంగా యానిమల్ ఆ రోజున విడుదలైతే.. మంచి వసూళ్లను అందుకునే అవకాశం ఉంటుంది. అలానే కంటెంట్ మరింత బాగుంటే.. మంచి లాభాలు అందుకునేలా వసూళ్లు కూడా వస్తాయి. మరి ఇలాంటి సందర్భంలో యానిమల్ టీమ్‌కు వెనక్కి తగ్గటం సరికాదని విశ్లేషకులు అంటున్నారు. మూవీటీమ్ రిలీజ్ విషయంలో పెద్ద తప్పు చేస్తుందని అభిప్రాయపడుతున్నారు. వీలైతే తమ నిర్ణయం మార్చుకోవాలని సూచిస్తున్నారు.