Begin typing your search above and press return to search.

యానిమల్ లో ఆ హీరో.. జస్ట్ మిస్!

సందీప్ రెడ్డి వంగా.. ఈ టాలీవుడ్ డైరెక్టర్ ఇప్పటి వరకు చేసింది మూడే మూడు సినిమాలు. కానీ ఓ రేంజ్ లో క్రేజ్ సంపాదించుకున్నారు

By:  Tupaki Desk   |   5 Jun 2024 12:57 PM GMT
యానిమల్ లో ఆ హీరో.. జస్ట్ మిస్!
X

సందీప్ రెడ్డి వంగా.. ఈ టాలీవుడ్ డైరెక్టర్ ఇప్పటి వరకు చేసింది మూడే మూడు సినిమాలు. కానీ ఓ రేంజ్ లో క్రేజ్ సంపాదించుకున్నారు. సెపరేట్ ఫ్యాన్ బేస్ దక్కించుకున్నారు. సందీప్ వంగా తీసిన చిత్రం అంటే ఇలా ఉంటుంది.. అనే మార్క్ సొంతం చేసుకున్నారు. తన అప్ కమింగ్ మూవీ ప్రభాస్ స్పిరిట్ ఇంకా స్టార్ట్ అవ్వకుండానే.. భారీ బజ్ క్రియేట్ చేసుకున్నారు. దీంతో సందీప్ కొత్త చిత్రాలపై అందరి దృష్టి పడింది.

విజయ్ దేవరకొండతో చేసిన తన ఫస్ట్ మూవీ అర్జున్ రెడ్డితో సంచలన విజయం సాధించారు సందీప్. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టిన ఈ మూవీ.. బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ తర్వాత అదే సినిమాను బాలీవుడ్ లో షాహిద్ కపూర్ హీరోగా కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేసి మరో హిట్ కొట్టారు. బీ టౌన్ సినీ ప్రియులును ఓ రేంజ్ లో మెప్పించారు. గత ఏడాది యానిమల్ మూవీ తెరకెక్కించి మరో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు.

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా నటించిన ఆ సినిమా.. పాన్ ఇండియా లెవెల్ లో హిట్ అయ్యి భారీ వసూళ్లు సాధించింది. అనేక విమర్శలు ఎదుర్కొన్నా.. అంతకు మించి ప్రశంసలు కూడా అందుకుంది. అయితే ఈ సినిమాలో ఇంటర్వెల్ తర్వాత వచ్చే రణబీర్ ఆస్పత్రి పాలైన సీన్ గుర్తుందా? గన్ షూట్ కు గురి కావడంతో హీరో ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్ లో చేరాల్సి వస్తుంది.

ఆస్పత్రిలో రణబీర్ కు చికిత్స చేసే డాక్టర్ రోల్ కోసం సందీప్ వంగా.. ముందుగా హీరో షాహిద్ కపూర్ ను తీసుకుందామని అనుకున్నట్లు ఇప్పుడు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. రణబీర్, షాహిద్ మధ్య అదిరిపోయే సీన్ జరిగేలా డైలాగులు కూడా రాసుకున్నారట. అంతా ఫిక్స్ అవుతున్న టైంలో.. డేట్స్ సెట్ అవ్వక షాహిద్ కపూర్ తాను యాక్ట్ చేయలేనని తప్పుకున్నట్లు తెలిసింది. దీంతో తన ప్లాన్ అంతా సందీప్ పక్కన పెట్టారని ఇప్పుడు గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇక షాహిద్ కపూర్.. ఇప్పటికే సందీప్ డైరెక్షన్ లో కబీర్ సింగ్ మూవీ చేసిన విషయం తెలిసిందే. దీంతో యానిమల్ మూవీ విషయంలో సందీప్ వేసిన ప్లాన్ వర్కౌట్ అయ్యి ఉంటే.. అదిరిపోయేదని నెటిజన్లు చెబుతున్నారు. చెప్పాలంటే ఇండస్ట్రీలో ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ అయిన మూవీ యూనివర్స్ లో భాగంగా తీసిన సీన్ లా ఉండేదని అంటున్నారు. ఇప్పటికైనా మించి పోయింది లేదని.. యానిమల్ సీక్వెల్ (యానిమల్ పార్క్)లో సందీప్ ప్లాన్ వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉందని కామెంట్స్ పెడుతున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.