Begin typing your search above and press return to search.

నిరాశే... 'యానిమల్‌' ఓటీటీ అప్డేట్‌

ఇప్పటి వరకు యానిమల్‌ ఓటీటీ స్ట్రీమింగ్‌ కు సంబంధించిన అధికారిక ప్రకటన రాలేదు.

By:  Tupaki Desk   |   24 Jan 2024 7:33 AM GMT
నిరాశే... యానిమల్‌ ఓటీటీ అప్డేట్‌
X

రణబీర్ కపూర్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా అనిల్ కపూర్‌, బాబీ డియోల్‌, త్రిప్తి దిమ్రీ ముఖ్య పాత్రల్లో నటించిన 'యానిమల్‌' సినిమా గత ఏడాది చివర్లో వచ్చి భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. తెలుగు దర్శకుడు సందీప్ వంగ రూపొందించిన యానిమల్ ఓటీటీ స్ట్రీమింగ్‌ కి రెడీ అవుతోంది.

ఇప్పటి వరకు యానిమల్‌ ఓటీటీ స్ట్రీమింగ్‌ కు సంబంధించిన అధికారిక ప్రకటన రాలేదు. అయితే సినిమాలో చూపించని కొన్ని సన్నివేశాలను కూడా ఓటీటీ లో యాడ్‌ చేయబోతున్నట్లు గత కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. ఆ విషయమై ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వలేదు.

రిపబ్లిక్ డే సందర్భంగా యానిమల్‌ సినిమాను ఓటీటీ ద్వారా స్ట్రీమింగ్‌ చేసేందుకు ప్రముఖ ఓటీటీ నెట్‌ ఫ్లిక్స్ రెడీ అవుతుందనే వార్తలు వస్తున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఓటీటీ లో కొత్త సన్నివేశాలను లేకుండానే స్ట్రీమింగ్‌ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

యాక్షన్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులు యానిమల్‌ సినిమాకు ఫిదా అయ్యారు. వందల కోట్ల వసూళ్లు నమోదు అవ్వడం తో పాటు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ కు మరో విజయం దక్కింది. రష్మిక మందన్న కి మొదటి బాలీవుడ్‌ సక్సెస్ దక్కింది. యానిమల్‌ సినిమా కు సీక్వెల్‌ ఉంటుందని ఇప్పటికే మేకర్స్‌ ప్రకటించారు.