వంగా యానిమాల్.. దాడి ఇంకా కొనసాగుతూనే ఉంది
ఇటీవల రిలీజ్ అయిన సినిమాల్లో ఎక్కువ మంది చూసిన సినిమాగా యానిమల్ రికార్డు సృష్టించింది. 6.2 మిలియన్ వ్యూస్ ను దక్కించుకుంది.
By: Tupaki Desk | 9 March 2024 2:30 AM GMTసాధారణంగా ఏ సినిమా అయినా రిలీజ్ కు ముందు కొన్ని రికార్డులు సృష్టిస్తోంది. విడుదల తర్వాత ఇంకొన్ని రికార్డులు క్రియేట్ చేస్తోంది. కానీ గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఓ చిత్రం మాత్రం రిలీజై మూడు నెలలు కావొస్తున్నా రికార్డులు సృష్టిస్తూనే ఉంది. ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఆ మూవీ.. అక్కడ కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇంతకీ ఆ మూవీ ఏంటంటే.. యానిమల్.
బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన యానిమల్ మూవీ.. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. రూ.900 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి బ్లాక్ బస్టర్ అయింది. తెలుగులో కూడా ఈ చిత్రానికి మంచి వసూళ్లు వచ్చాయి. బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు బ్రేక్ చేసి సంచలనం సృష్టించింది.
అయితే ఈ మూవీ ఎంతటి హిట్ అయిందో.. అంతటి విమర్శలు కూడా అందుకుంది. చాలా మంది ప్రముఖులు యానిమల్ సినిమాపై విమర్శలు గుప్పించారు. కొన్ని సీన్స్, డైలాగులపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కానీ ఈ సినిమా.. ఇప్పుడు ఓటీటీలో దూసుకుపోతోంది. ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ.. పలు రికార్డులను బద్దలుకొట్టింది. వరుసగా ఆరు వారాలపాటు నెట్ ఫ్లిక్స్ టాప్ 10 లిస్ట్ లో నిలిచింది.
ఇటీవల రిలీజ్ అయిన సినిమాల్లో ఎక్కువ మంది చూసిన సినిమాగా యానిమల్ రికార్డు సృష్టించింది. 6.2 మిలియన్ వ్యూస్ ను దక్కించుకుంది. ఇండియాలోనే కాకుండా ప్రపంచ దేశాల్లోని సినీ అవర్స్ కూడా ఈ మూవీని ఓటీటీలో ఆదరిస్తున్నారు. అయితే షారుక్ ఖాన్ డంకీకి 4.9 మిలియన్ వ్యూస్ రాగా, ప్రభాస్ సలార్ కు 1.6 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇప్పుడు ఆ రెండు మూవీలను యానిమల్ వెనక్కి నెట్టింది.
స్టోరీ లైన్ ఇదే..
దేశంలో రిచ్చెస్ట్ పర్సన్ అయిన బల్బీర్ సింగ్ (అనిల్ కపూర్) కొడుకు రణ్ విజయ్ (రణబీర్ సింగ్). ఎవరినైనా సరే ధైర్యంగా ఎదిరిస్తాడు. చిన్నతనం నుంచే నాన్నంటే ఎంత ప్రేమ. కానీ బల్బీర్ సింగ్ బిజినెస్ లలో బిజీగా గడుపుతూ కొడుకు రణ్ విజయ్‌ను పట్టించుకోడు. కొన్ని విషయాల్లో ఇద్దరి మధ్య గొడవలు మొదలవుతాయి. దీంతో గీతాంజలి (రష్మిక)ని పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లిపోతాడు హీరో. కొన్నేళ్ల తర్వాత తండ్రిపై హత్యాయత్నం జరిగిందని తెలిసి వెంటే తన భార్య, పిల్లలతో ఇండియాకు వస్తాడు. వచ్చాక ఏం జరిగిందనేది మిగతాస్టోరీ.