ఆన్ పబ్లిక్ డిమాండ్..వాళ్లకిక పగలు రాత్రి లేదా!
కానీ సందీప్ రెడ్డి కంటెంట్ కి మాత్రం తిరుగులేదని హాలు నిండినది అని బోర్డులు పెట్టడంతోనే సంగతేంటో తెలిసిపోతుంది.
By: Tupaki Desk | 6 Dec 2023 10:58 AM GMT'యానిమల్' బాక్సాఫీస్ వద్ద దుమారం సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. రిలీజ్ అయి వారం రోజులు సమీపిస్తున్నా 'యానిమల్' ఊచకోత మాత్రం ఆగలేదు. బాక్సాఫీస్ వద్ద వసూళ్లు సునామీ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే షారుక్ ఖాన్ పేరిట ఉన్న ఓ రికార్డును బ్రేక్ చేసింది. వారం గడవక ముందే 500 కోట్ల క్లబ్ కి అతి చేరువలో ఉంది. సినిమా వసూళ్లు చూస్తుంటే? అంతకంతకు పెరుగుతున్నాయే తప్ప తగ్గింది ఎక్కడా లేదు.
పోటీగా మరో సినిమా కూడా లేకపోవడంతో అన్ని థియేటర్లలలోనూ 'యానిమల్' ఆడిస్తున్నారు. తెలుగు..హిందీ వెర్షన్లు ఒకే చోట అందుబాటులో ఉండటంతో ప్రేక్షకులకు ఇబ్బంది తలెత్తడం లేదు. వసూళ్లు క్రమంగా పెరగడానికి ఇదే ముఖ్య కారణమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ మధ్య కాలంలో ఇలా వసూళ్లు పెరగడం చూడటం లేదని షాక్ అవుతున్నారు. వారం రోజులు సమీపిస్తున్నా ఇంకా థియేటర్లన్నీ హౌస్ ఫుల్ అవుతున్నాయి.
ఓ హిందీ సినిమాకి తెలుగు రాష్ట్రాల్లోనూ ఇలాంటి సన్నివేశం కనిపించడం ఇదే తొలిసారి. సాధారణంగా హిందీ సినిమాలు రెండు రోజులు అడితే ఎక్కువ . కానీ సందీప్ రెడ్డి కంటెంట్ కి మాత్రం తిరుగులేదని హాలు నిండినది అని బోర్డులు పెట్టడంతోనే సంగతేంటో తెలిసిపోతుంది. ఈ సినమా రణబీర్ కపూర్ కి టాలీవుడ్ ది బెస్ట్ చిత్రంగా నిలిచిపోతుందనడం ఎలాంటి సందేహం లేదు.
తాజా సంగతేంటి అంటే' యానిమల్' షోస్ ని పెంచాలని పబ్లిక్ సైతం పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఆన్ పబ్లిక్ డిమాండ్ అంటూ రాంగోపాల్ వర్మ ఇన్ స్టాలో ఓ పోస్ట్ పెట్టారు. వివిధ సిటీల్లో అర్దరాత్రి షోలు పడుతు న్నాయని..అలాగే తెల్లవారు జామున కూడా మరో షో పడుతుందని తెలిపారు. ఉదయం రెండు గంటలకు.. తెల్లవారు ఐదు గంటలకు ముంబైలో స్పెషల్ షోలు వేస్తున్నారు.మాక్సస్ సినిమాస్.. 1 ఏఎమ్..2 ఏఎమ్.. 5.30 ఏఎమ్ అంటూ షో టైమింగ్ లను డిస్ ప్లే చేస్తుంది. పీవీఆర్ ఓబోరోయ్ మాల్.. అంధేరి పీవీఆర్ సిటీ మాల్ 12.30 ఏఎమ్.. 1.05 ఏఎమ్ లకు షోలు పడుతున్నాయి.