Begin typing your search above and press return to search.

యానిమాల్ రన్ టైమ్.. డైరెక్టర్ తేల్చేశాడు

మూడు గంటల నిమిషాలు ఎక్కువ అనుకుంటే సందీప్ ఈసారి మరింత డోస్ పెంచడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

By:  Tupaki Desk   |   22 Nov 2023 2:02 PM GMT
యానిమాల్ రన్ టైమ్.. డైరెక్టర్ తేల్చేశాడు
X

అర్జున్ రెడ్డి కథతో టాలీవుడ్ లోనే కాకుండా అటు బాలీవుడ్ లో కూడా సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు సందీప్ ఈసారి రణబీర్ కపూర్ తో యానిమాల్ అనే సినిమాతో రాబోతున్నాడు. మొదటి సినిమా కంటే రెండవ సినిమాలో దర్శకుడు మరింత బోల్డ్ కంటెంట్ ను హైలెట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇక సినిమాకు సంబంధించిన కంటెంట్ ఎలా ఉండబోతోందో ఇప్పటికే టీజర్ ద్వారా ఒక క్లారిటీ ఇచ్చేశారు.

ఇక సాంగ్స్ లో కూడా రొమాన్స్ ను హైలెట్ చేశారు. రణబీర్ పాత్రను అయితే వైల్డ్ గా హైలెట్ చేయబోతున్నట్లు మరొక పాటలో తేల్చేశారు. అయితే సినిమా రన్ టైమ్ ఎంత ఉండబోతోంది అనే విషయంలో ఇప్పటికే చాలా రకాల గాసిప్స్ వినిపించాయి. ఇక అర్జున్ రెడ్డి కథను దాదాపు 3 గంటల నిడివితో చూపించిన దర్శకుడు బాలీవుడ్ కు వచ్చే సరికి 8 నిమిషాలు తగ్గించాడు.

అయితే ఇప్పుడు యానిమాల్ కథను 3 గంటల 21 నిమిషాలు చూపించబొతున్నట్లు తెలుస్తోంది. అంటే 201 నిమిషాలు. మూడు గంటల నిమిషాలు ఎక్కువ అనుకుంటే సందీప్ ఈసారి మరింత డోస్ పెంచడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. సినిమాకు సెన్సార్ నుంచి A సర్టిఫికెట్ వచ్చిన విషయం తెలిసిందే. హీరో రక్తలు చిందించేలా ఊచకోత కోయడమే కాకుండా హీరోయిన్ రష్మిక మందన్నతో ఘాటైన రొమాన్స్ ను సినిమాలో గట్టిగానే హైలెట్ చేసినట్లు తెలుస్తోంది.

ఏదేమైనా రన్ టైమ్ మాత్రం ఇటీవల కాలంలో కొన్ని సినిమాలను గట్టి దెబ్బె కొట్టాయి. టైగర్ నాగేశ్వరరావు విషయంలో కూడా దర్శకుడు ఇదే తరహాలో పోవడంతో మళ్ళీ తరువాత తగ్గించక తప్పలేదు. కానీ సందీప్ రెడ్డి వంగా మాత్రం కంటెంట్ విషయంలో చాలా ధీమాగా ఉన్నాడు. ఆడియెన్స్ రన్ టైమ్ విషయాన్ని పట్టించుకోకుండా సినిమా ఆకట్టుకుంటుందని నమ్మకంతో ఉన్నాడు.

ఇక సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను గురువారం విడుదల చేస్తున్నారు. దాని రెస్పాన్స్ ను బట్టి సినిమా బాక్సాఫీస్ వద్ద యానిమాల్ ఏ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకుంటుందో చూడాలి. ఇక రణబీర్ కపూర్ తండ్రిగా యానిమాల్ లో అనిల్ కపూర్ నటించగా బాబీ డియోల్ పవర్ఫుల్ విలన్ గా కనిపించనున్నాడు. ఇక వరల్డ్ వైడ్ గా ఈ సినిమా డిసెంబర్ 1న విడుదల కానుంది.