Begin typing your search above and press return to search.

యానిమల్‌ : ఆమె తీసుకుంది రూ.40 లక్షలు... చేసింది రూ.4 కోట్లు

ఒక వెబ్‌ సిరీస్ లో నటించి, సోషల్‌ మీడియాలో అందాల ఫోటో షూట్స్ ను షేర్‌ చేసినా కూడా పెద్దగా ఈమెకి గుర్తింపు ఉండేది కాదు.

By:  Tupaki Desk   |   14 Dec 2023 10:05 AM GMT
యానిమల్‌ : ఆమె తీసుకుంది రూ.40 లక్షలు... చేసింది రూ.4 కోట్లు
X

త్రిప్తి డిమ్రి... ప్రస్తుతం ఈ పేరు ఏ రేంజ్ లో మారు మ్రోగుతోందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యానిమల్‌ సినిమాకు ముందు ఈమె అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఒక వెబ్‌ సిరీస్ లో నటించి, సోషల్‌ మీడియాలో అందాల ఫోటో షూట్స్ ను షేర్‌ చేసినా కూడా పెద్దగా ఈమెకి గుర్తింపు ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఆమె రేంజ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

యానిమల్‌ సినిమాలో మెయిన్‌ హీరోయిన్‌ గా నటించిన రష్మిక మందన్నా కంటే కూడా ఎక్కువగా ఇప్పుడు చిన్న పాత్రలో నటించిన త్రిప్తి డిమ్రి గురించిన చర్చ జరుగుతోంది. రణబీర్‌ కపూర్‌ తో ఆమె చేసిన సన్నివేశాలు.. ముఖ్యంగా వారిద్దరి మధ్య ఉండే ఇంటిమేట్‌ సన్నివేశాలు సినిమాకు మాస్ లో పిచ్చి క్రేజ్ ను తెచ్చి పెట్టాయి.

సినిమా వెయ్యి కోట్ల కలెక్షన్స్ దిశగా దూసుకు పోతుంది అంటే అందులో ఒక కారణం త్రిప్తి డిమ్రి అందం మరియు ఆమె నటన అనడంలో సందేహం లేదు అంటూ జాతీయ మీడియా వర్గాల వారు కూడా కామెంట్స్ చేస్తున్నారు. అంతటి త్రిప్తి యానిమల్‌ సినిమా కోసం తీసుకున్న పారితోషికం ఎంతో తెలుసా.. అక్షరాల రూ.40 లక్షలు.

ఔను... త్రిప్తి డిమ్రి కేవలం రూ.40 లక్షలు మాత్రమే పారితోషికంగా తీసుకుంది. సినిమా విడుదల అయ్యి, నిర్మాతలకు మంచి లాభాలు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఆమెకు ఏమైనా పెద్ద మొత్తం ఇచ్చి ఉంటారేమో కానీ... సినిమా కి ఆమె సైన్ చేసినప్పుడు మాత్రం కేవలం రూ.40 లక్షలకే ఓకే చెప్పిందని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

రష్మిక మందన్న ఈ సినిమాకు గాను రూ.4 కోట్లు, బాబీ డియోల్‌ రూ.4 కోట్లు పారితోషికంగా తీసుకున్నారు. ఇక రణబీర్ కపూర్‌ రూ.50 కోట్లు మరియు లాభాల్లో వాటాను తీసుకున్నట్లుగా కొన్ని బాలీవుడ్‌ మీడియా సంస్థలు కథనాలు రాస్తున్నాయి. వీరి పారితోషికం ఏమో కానీ త్రిప్తి డిమ్రి పారితోషికం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

యానిమల్‌ కి రూ.40 లక్షలు పారితోషికం తీసుకున్న త్రిప్తి... ఆ సినిమా తో వచ్చిన క్రేజ్ తో తదుపరి సినిమాకు కోటికి పైగా తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఆమె డిమాండ్ చేయాలే కాని రాబోయే రోజుల్లో రూ.5 కోట్ల వరకు కూడా త్రిప్తి అందుకునే అవకాశాలు ఉన్నాయంటూ కొందరు బాలీవుడ్‌ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.