యానిమల్.. ఆ 18 నిమిషాలు మాములుగా ఉండదట
భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా యానిమల్ ని డిసెంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నారు.
By: Tupaki Desk | 27 Nov 2023 4:43 AM GMTరణబీర్ కపూర్ హీరోగా, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి రాబోతున్న సినిమా యానిమల్. రష్మిక మందన ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా యానిమల్ ని డిసెంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నారు. టి సిరీస్, భద్రకాళీ పిక్చర్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించాయి.
ఇప్పటికే ప్రేక్షకుల ముందుకి వచ్చిన యానిమల్ ట్రైలర్ నెక్స్ట్ లెవల్ గూస్ బంప్స్ అనే విధంగా ఉంది. ముఖ్యంగా సందీప్ రెడ్డి వంగా డిజైన్ చేసిన హీరో క్యారెక్టరైజేషన్, యాక్షన్ ఎపిసోడ్స్ యానిమల్ సినిమాలో చాలా పవర్ ఫుల్ గా ఉండబోతున్నాయని ట్రైలర్ తోనే అర్ధమైంది. దీంతో ఈ సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ పెరిగిపోయాయి. తెలుగు, హిందీ భాషలలో అయితే కచ్చితంగా యానిమల్ సాలిడ్ ఓపెనింగ్స్ రాబట్టే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే ఈ సినిమాని తమిళ్ సర్కిల్ లో కూడా గట్టిగానే ప్రమోట్ చేస్తున్నారు. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తమ్ముడు నిర్మాత ప్రణయ్ రెడ్డి యామినల్ ప్రమోషన్స్ లో భాగంగా ఆసక్తికర విషయాన్ని ఓపెన్ చేశారు. ఈ సినిమాలోని ఇంటర్వెల్ బ్యాంగ్ యాక్షన్ ఎపిసోడ్ ఏకంగా 18 నిమిషాలు ఉంటుందని తెలిపాడు. ఈ ఎపిసోడ్ మొత్తం ఆడియన్స్ ని సీట్ ఎడ్జ్ లో కూర్చోబెడుతుందని చెప్పుకొచ్చారు.
ట్రైలర్ లో చూసిన విధంగానే హై ఇంటెన్సివ్ గా ఉంటుందని చెప్పారు. బాబీ డియోల్, రణబీర్ కపూర్ మధ్య వచ్చే సంభాషణలు కూడా అద్భుతంగా ఉంటాయని చెప్పారు. కచ్చితంగా యాక్షన్ ఎలిమెంట్స్ అందరికి నచ్చుతాయని ప్రణయ్ రెడ్డి మీడియా ముఖంగా తెలిపారు. 18 నిమిషాల యాక్షన్ ఎపిసోడ్ అంటే కచ్చితంగా నెక్స్ట్లెవల్ ఉంటుందని ఎక్స్ పెక్ట్ చేయొచ్చు.
సందీప్ రెడ్డి వంగా యానిమల్ సినిమాని కల్ట్ యాక్షన్ మూవీగా ఆవిష్కరించినట్లు దీనిని బట్టి అర్ధమవుతోంది. మరి ఆడియన్స్ ఈ హైవోల్టేజ్ యాక్షన్ ని ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రణబీర్ కపూర్ ని కూడా ఇప్పడి వరకు ఎన్నడూ చేయని కొత్త క్యారెక్టర్ లో రిప్రజెంట్ చేస్తున్నారు. బాలీవుడ్ ఆడియన్స్ దీనిని ఎలా యాక్సెప్ట్ చేస్తారనేది చూడాలి.