Begin typing your search above and press return to search.

మరోసారి ఆ తెలుగు హీరో కోసం అనిరుధ్

సౌత్ ఇండియాలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుధ్ రవిచందర్ తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు.

By:  Tupaki Desk   |   2 Oct 2024 4:45 AM GMT
మరోసారి ఆ తెలుగు హీరో కోసం అనిరుధ్
X

సౌత్ ఇండియాలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుధ్ రవిచందర్ తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు. అనిరుద్ ఎక్కువగా తమిళ్ సినిమాలకి మ్యూజిక్ అందిస్తూ వచ్చారు. ‘అజ్ఞాతవాసి’ సినిమాతో అనిరుద్ ని త్రివిక్రమ్ శ్రీనివాస్ టాలీవుడ్ కి పరిచయం చేశారు. ఈ సినిమాలో సాంగ్స్ కి మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిన కూడా కమర్షియల్ డిజాస్టర్ అయ్యింది. తరువాత నాని ‘జెర్సీ’ సినిమాకి అనిరుద్ మ్యూజిక్ అందించారు.

ఈ మూవీ కమర్షియల్ సక్సెస్ కాకపోయిన పర్వాలేదనే టాక్ తెచ్చుకుంది. అనిరుద్ ‘జెర్సీ’ సినిమాకి అద్భుతమైన మ్యూజిక్ అందించాడు. తరువాత నానితోనే మరల ‘గ్యాంగ్ లీడర్’ సినిమాకి అనిరుద్ వర్క్ చేశాడు. ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. సినిమాలో సాంగ్స్ మాత్రం హిట్ అయ్యాయి. మరల చాలా గ్యాప్ తర్వాత తాజాగా ‘దేవర’ సినిమాతో అనిరుద్ తెలుగు ప్రేక్షకులకి తన సంగీతం రుచి చూపించారు. ఈ సినిమాలో సాంగ్స్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.

కథ కొంత వీక్ గా ఉన్నా అనిరుద్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో సినిమాకి హైప్ వచ్చిందనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం తెలుగులో విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా మూవీకి అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇదిలా ఉంటే అనిరుద్ మరోసారి నేచురల్ నానితో వర్క్ చేయబోతున్నాడని టాక్ వినిపిస్తోంది. నాని హీరోగా శ్రీకాంత్ ఓదేల దర్శకత్వంలో వచ్చిన దసరా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.

మరోసారి వీరిద్దరి కాంబోలో సినిమా తెరకెక్కబోతోంది. ఇప్పటికే నాని ఈ సినిమాపై క్లారిటీ ఇచ్చేశాడు. ప్రస్తుతం చేస్తోన్న ‘హిట్ 3’ కంప్లీట్ అయిన వెంటనే శ్రీకాంత్ ఓదేల దర్శకత్వంలో మూవీ సెట్స్ పైకి వెళ్తుందని చెప్పారు. ప్రస్తుతం ఈ మూవీ ప్రీప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ‘దసరా’కి మించిన ఇంటరెస్టింగ్ కథాంశంతో శ్రీకాంత్ ఓదేల నానితో నెక్స్ట్ మూవీ చేయబోతున్నట్లు స్పష్టం చేశాడు. ఇదిలా ఉంటే ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుద్ ని కన్ఫర్మ్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది.

త్వరలో దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావొచ్చని అంటున్నారు. ఒక వేళ అనిరుద్ నెక్స్ట్ నాని సినిమాకి మ్యూజిక్ అందిస్తే మాత్రం కచ్చితంగా బెస్ట్ ఆల్బమ్ ఇచ్చే అవకాశం ఉంది. అలాగే మూవీ కూడా కమర్షియల్ హిట్ అవ్వొచ్చని ఇండస్ట్రీ వర్గాలలో మాట్లాడుకుంటున్నారు. మరి అది ఎంత వరకు సాధ్యం అవుతుందనేది వేచి చూడాలి.