అనిరుద్ మీద గురి పెట్టారుగా..?
ప్రస్తుతం స్టార్ సినిమాల బిజిఎం విషయంలో ఒకరిని మించి మరొకరు అనిపించేలా చేస్తున్నారు.
By: Tupaki Desk | 23 Jan 2025 8:30 AM GMTస్టార్ సినిమాలకు సంగీతం ఎంత ఇంపార్టెంట్ అన్నది తెలిసిందే. సినిమా కథ కథనాలకు తగినట్టుగా సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తే ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు. అందుకే స్టార్ సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో కూడా స్పెషల్ డిస్కషన్స్ జరుగుతాయి. అంతేకాదు స్టార్ హీరోల ఎలివేషన్స్ కు మ్యూజిక్ డైరెక్టర్స్ ఇచ్చే బిజిఎం ఎంత హై లో ఉంటే అంత ఇంపాక్ట్ ఉంటుంది. ప్రస్తుతం స్టార్ సినిమాల బిజిఎం విషయంలో ఒకరిని మించి మరొకరు అనిపించేలా చేస్తున్నారు.
తెలుగులో ఇలా స్టార్స్ కు బిజిఎం ఇవ్వడంలో దేవి శ్రీ ప్రసాద్, థమన్ ఇద్దరు అదరగొట్టేస్తున్నారు. కోలీవుడ్ లో మాత్రం ఆ బాధ్యత అనిరుద్ తీసుకున్నాడు. రజినీకాంత్, కమల్ సినిమాలకు అనిరుద్ ఇచ్చే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. అనిరుద్ మ్యూజిక్ తోనే సినిమా సగం హిట్ అనిపించేలా చేస్తున్నాడు. తెలుగులో అనిరుద్ ఒకటి రెండు ప్రయత్నాలు చేసినా కంటిన్యూ చేయడం కుదరలేదు.
ఎన్టీఆర్ దేవర సినిమాకు అనిరుద్ మ్యూజిక్ ఇంప్రెస్ చేసింది. ఒక సెపరేట్ వరల్డ్ లోకి తీసుకెళ్లేలా అనిరుద్ ఇచ్చిన మ్యూజిక్ సినిమాకు ప్లస్ అయ్యింది. ఐతే అనిరు తన నెక్స్ట్ టాలీవుడ్ సీనియర్ స్టార్స్ అయిన చిరంజీవి, బాలకృష్ణలకు మ్యూజిక్ అందిస్తున్నాడని తెలుస్తుంది. అక్కడ రజినీ సినిమాలకు అనిరుద్ మ్యూజిక్ రీసౌండ్ ఒక రేంజ్ లో ఉంటుంది. ఇప్పుడు అదే మ్యాజిక్ బాలయ్య, చిరుసినిమాలకు అనిరుద్ రిపీట్ చేస్తాడా లేదా అన్నది తెలియాల్సి ఉంది.
చిరంజీవి నెక్స్ట్ సినిమా అనిల్ రావిపూడితో చేయబోతున్నాడు. నెక్స్ట్ బాలయ్య గోపీచంద్ మలినేని కాంబో సినిమాకు కూడా అనిరుద్ మ్యూజిక్ అందిస్తాడని తెలుస్తుంది. సో ఈ రెండు సినిమాలతో మాత్రం అనిరుద్ తన మార్క్ మ్యూజిక్ తో రెచ్చిపోవాల్సి ఉంటుంది. మరి చిరు, బాలయ్య సినిమాలకు నిజంగానే అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నాడా లేదా అన్నది చూడాలి. కోలీవుడ్ లో వరుస ప్రాజెక్ట్ లు చేస్తున్న అనిరుద్ తెలుగు ప్రాజెక్ట్ లు ఒప్పుకునే ఛాన్స్ కనిపించట్లేదు. అలాంటిది ఒకేసారి ఇద్దరు తెలుగు సూపర్ స్టార్స్ సినిమాలకు మ్యూజిక్ అందిస్తాడా అన్నది త్వరలో తెలుస్తుంది. అనిరుద్ ఈ సినిమాలకు సంగీతం అందిస్తే మాత్రం ఆ సినిమాలకు స్పెషల్ ఎట్రాక్షన్ అవుతుందని చెప్పొచ్చు.