Begin typing your search above and press return to search.

అనిరుధ్ దెబ్బకు దేవికి మరో మైనెస్సా..?

అనిరుధ్ రవిచందర్.. ఈ బ్రాండ్ తో వచ్చే సంగీతానికి ఇప్పుడు ప్రాధాన్యం మరింతగా పెరుగుతోంది.

By:  Tupaki Desk   |   12 Oct 2024 2:30 AM GMT
అనిరుధ్ దెబ్బకు దేవికి మరో మైనెస్సా..?
X

అనిరుధ్ రవిచందర్.. ఈ బ్రాండ్ తో వచ్చే సంగీతానికి ఇప్పుడు ప్రాధాన్యం మరింతగా పెరుగుతోంది. పాన్-ఇండియా స్థాయిలో పర్ఫెక్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎదగడం వల్ల చాలా మంది దర్శక నిర్మాతలు అతన్నే మొదటి ఛాయిస్ గా అనుకుంటున్నారు. ఇటీవల వచ్చిన సినిమాలతో అనిరుధ్ తన సంగీతంతో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించాడు. దేవర తో టాలీవుడ్ లో కూడా డిమాండ్ మరింత పెరిగింది.

తాజాగా నాని సినిమాకు సంబంధించిన ఆఫర్ కూడా పట్టేసినట్లు తెలుస్తోంది. నేచురల్ స్టార్ నాని - శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో మరో భారీ సినిమా స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. శ్రీకాంత్ గతంలో దసరా సినిమాతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు మరోసారి నానితో సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాకి సంబంధించి మొదట దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తారని అనుకున్నప్పటికీ, చివరికి అనిరుధ్ రవిచందర్ పేరు తెరపైకి వచ్చింది.

టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఉన్న దేవిశ్రీప్రసాద్ సైతం అనిరుధ్ వేగం ముందు సరితూగడం లేదని అనిపిస్తోంది. చేతి వరకు వచ్చిన ప్రాజెక్టు ఊహించని విధంగా చేజారినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దేవి పుష్ప 2తో బిజీగా ఉన్నాడు. ఇక అప్పుడప్పుడు ఇలాంటి మంచి హిట్ కాంబినేషన్ సినిమాలకు వర్క్ చేయాలని చూస్తున్నాడు. కానీ అనిరుద్ ఆ ఛాన్స్ ఇవ్వడం లేదు.

నాని - అనిరుధ్ కాంబినేషన్‌లో వచ్చిన గ్యాంగ్ లీడర్, జెర్సీ చిత్రాల్లోని పాటలు ఎంతగా సక్సెస్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీంతో దర్శకుడు శ్రీకాంత్ తన తదుపరి ప్రాజెక్ట్‌లో అనిరుధ్‌తో పని చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు టాక్. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాలో పనిచేయడం అంటే ఆ సినిమా సంగీతం కూడా భారీ స్థాయిలో ఉండే అవకాశం ఉండేది. కానీ అనిరుధ్ ఈ ప్రాజెక్ట్‌లోకి రావడం అంటే సినిమాకు కొత్త ఊపును తెచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సినీ పరిశ్రమలో చర్చ జరుగుతోంది.

ఈ నిర్ణయానికి వెనక కారణాలు ఎలా ఉన్నా, నాని, అనిరుధ్ కాంబినేషన్ సినిమాకు మరింత హైప్ క్రియేట్ చేస్తుందని ఫ్యాన్స్ విశ్వసిస్తున్నారు. ప్రస్తుతం అనిరుధ్ కోలీవుడ్ బాలీవుడ్ అని తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలలో వర్క్ చేస్తున్నాడు. అలాగే అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో కూడా సినిమాకు మరింత బలాన్ని ఇవ్వగలడు. జైలర్ సినిమా విజయంలో అతని పాత్ర ఎక్కువగా ఉందని రజినీకాంత్ సైతం పొగిడారు. మరి అనిరుధ్ కు నేటితరం మ్యూజిక్ డైరెక్టర్స్ ఎంతవరకు పోటీని ఇస్తారో చూడాలి.