Begin typing your search above and press return to search.

మెల్లిగా జెండా పాతేస్తున్నాడు!

అనిరుధ్ క్రేజ్, ప‌నిత‌నం చూశాక ప్ర‌తి ఒక్క‌రూ త‌న‌తో ప‌ని చేయాల‌నుకుంటున్నారు. కానీ అనిరుధ్ మాత్రం ఖాళీగా లేడు. వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్నాడు.

By:  Tupaki Desk   |   25 Feb 2025 4:57 AM GMT
మెల్లిగా జెండా పాతేస్తున్నాడు!
X

సౌత్ మ్యూజిక్ సెన్సేష‌న్ అనిరుధ్ ర‌విచంద‌ర్ టాలెంట్ గురించి కొత్త‌గా ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. అనిరుధ్ ఓ సినిమాకు వ‌ర్క్ చేస్తున్నాడ‌ని టాక్ వ‌స్తే చాలు ఆ సినిమాపై అంచ‌నాలు అమాంతం పెరిగిపోతాయి. ప్ర‌స్తుతం ఆ రేంజ్ స‌క్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు అనిరుధ్. త‌మిళ సినిమాల‌తో పాటూ తెలుగు, హిందీ సినిమాల‌కు కూడా వ‌ర్క్ చేస్తున్న అనిరుధ్ ప్ర‌స్తుతం చాలా బిజీగా ఉన్నాడు.

అనిరుధ్ క్రేజ్, ప‌నిత‌నం చూశాక ప్ర‌తి ఒక్క‌రూ త‌న‌తో ప‌ని చేయాల‌నుకుంటున్నారు. కానీ అనిరుధ్ మాత్రం ఖాళీగా లేడు. వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. దీంతో మొన్న‌టివ‌ర‌కు వ‌చ్చిన ప్ర‌తీ ఆఫ‌ర్ ను ఓకే చేయ‌లేక‌పోయాడు. ఇంత బిజీ షెడ్యూల్‌లో ఒక‌వేళ అనిరుధ్ దొరికి డేట్స్ ఇచ్చినా త‌న‌తో వ‌ర్క్ చేయించుకోవ‌డం మాత్రం పెద్ద పరీక్ష అయిపోయింది.

అంద‌రూ ఇలా అనుకుంటున్న టైమ్ లో అనిరుధ్ మెల్లిగా టాలీవుడ్ లో జెండా పాతేస్తున్నాడు. తాను క‌మిట్ అయిన సినిమాల‌కు సంబంధించిన మ్యూజిక్ ను ద‌ర్శ‌క‌నిర్మాత‌లు అడిగిన టైమ్ లో ఇస్తూ అనిరుధ్ వారిని ఎంగేజ్ చేస్తున్నాడు. మొన్న వ‌చ్చిన విజ‌య్ దేవ‌ర‌కొండ కింగ్ డ‌మ్ మూవీకి టీజ‌ర్ కు లేట్ చేయ‌కుండా బీజీఎం ఇచ్చిన అనిరుధ్, అదే బ్యాన‌ర్ లో రూపొందుతున్న మ్యాజిక్ మూవీకి ఫ‌స్ట్ లిరిక‌ల్ ను కూడా ఇచ్చాడు.

ఈ రెండింటిలో అనిరుధ్ మార్క్ చాలా స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. త్వ‌ర‌లోనే మ్యాజిక్ ఫైన‌ల్ వెర్ష‌న్ రీరికార్డింగ్ ను పూర్తి చేయ‌నున్నాడ‌ట అనిరుధ్. ఇవి కాకుండా మార్చి 3న నాని- శ్రీకాంత్ ఓదెల‌ మూవీకి సంబంధించిన టీజ‌ర్ రాబోతుంది. ఈ టీజ‌ర్ క‌ట్ ఆల్రెడీ ఓకే అయిపోయింది. టీజ‌ర్‌ను ప్రైవేట్ గా చూసిన‌వాళ్లంతా ది ప్యార‌డైజ్ టీజ‌ర్ ను తెగ పొగిడేస్తున్నారు.

టీజ‌ర్ చాలా వ‌యొలెంట్ గా ఉంద‌ని, ద‌స‌రా సినిమాతో పోలిస్తే పదింతలు ఎక్కువ‌గా ది ప్యార‌డైజ్ లో వ‌యొలెన్స్ ఉంటుంద‌ని అన్నింటినీ మించి టీజ‌ర్‌కు అనిరుధ్ ఇచ్చిన బీజీఎం ఓ రేంజ్ లో ఉంటుంద‌ని తెగ ఎలివేష‌న్స్ ఇస్తున్నారు. టాలీవుడ్ లో అనిరుధ్‌కి ఈ మూడు సినిమాలు చాలా కీల‌కం కాబోతున్నాయి.

ఇవి కాకుండా బాల‌కృష్ణ‌- గోపీచంద్ మలినేని, చిరూ- ఓదెల సినిమాలు కూడా ఒప్పుకున్నాడంటున్నారు కానీ ఇంకా అగ్రిమెంట్స్ కావాల్సి ఉందంటున్నారు. ఇవి కాకుండా కోలీవుడ్ లో జ‌న‌నాయ‌గ‌న్, జైల‌ర్2, మ‌ద‌రాసి, కూలి, ఇండియ‌న్3, విక్ర‌మ‌2, ఖైదీ2 ప్రాజెక్టుల‌తో అనిరుధ్ ఎంతో బిజీగా ఉన్నాడు. మ‌రి ఇంత బిజీలో టాలీవుడ్ సినిమాల‌కు అనిరుధ్ ఏ మేర‌కు న్యాయం చేస్తాడ‌నేది చూడాలి.