Begin typing your search above and press return to search.

విజయ్ మూవీ.. ఆ లోటు కనిపిస్తోంది

చిన్న వయసులో మ్యూజిక్ డైరెక్టర్ గా కెరీర్ స్టార్ చేసిన ఆయన.. ఇప్పుడు టాప్ సంగీత దర్శకుల్లో ఒకరిగా మారిపోయారు.

By:  Tupaki Desk   |   6 Sep 2024 12:30 PM GMT
విజయ్ మూవీ.. ఆ లోటు కనిపిస్తోంది
X

అనిరుధ్ రవిచందర్.. ఈ పేరు వినని మ్యూజిక్ లవర్స్ ఉండరని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. కొన్నేళ్ల క్రితం వచ్చి ఫుల్ వైరల్ అయిన వై దిస్ కొలవరి సాంగ్ కంపోజ్ చేసేటప్పుడు ఆయన వయసు 22 ఏళ్లే. చిన్న వయసులో మ్యూజిక్ డైరెక్టర్ గా కెరీర్ స్టార్ చేసిన ఆయన.. ఇప్పుడు టాప్ సంగీత దర్శకుల్లో ఒకరిగా మారిపోయారు. సౌత్ సినీ ఇండస్ట్రీలో ఓ రేంజ్ లో క్రేజ్ సంపాదించుకున్నారు. తన వర్క్ తో అందరినీ ఫిదా చేస్తున్నారు.

అనిరుధ్ ప్రస్తుతం వరుస అవకాశాలు అందుకుంటున్నారు. తెలుగులో స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో వస్తున్న దేవర చిత్రానికి వర్క్ చేస్తున్నారు. ఇప్పటికే ఆ మూవీ నుంచి వచ్చిన సాంగ్స్ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. మ్యూజిక్ లవర్స్ ను తెగ ఆకట్టుకున్నాయి. దేవరతోపాటు విడమూర్చి, రజనీకాంత్ వెట్టయన్, కూలీ, విఘ్నేష్ శివన్ ఎల్‌ ఐసీ చిత్రాలకు కూడా సంగీతం అందిస్తున్నారు అనిరుధ్ రవిచందర్.

కాగా, దళపతి విజయ్ నటించిన మాస్టర్, లియో, బీస్ట్ సినిమాలకు అనిరుధ్ వర్క్ చేసిన విషయం తెలిసిందే. మూడు చిత్రాలకు కూడా తన వర్క్ తో ఆయన అలరించారు. తన సాంగ్స్ అండ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో మెప్పించారు. ముఖ్యంగా లియో మూవీకి అనిరుధ్ చేసిన వర్క్ వేరే లెవెల్ అని చెప్పాలి. అయితే రీసెంట్ గా విజయ్ యాక్ట్ చేసిన ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్- GOAT సినిమా రిలీజ్ అయింది.

ఆ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా యువన్ శంకర్ రాజా వర్క్ చేశారు. మంచి టాలెంట్ తో ఆకట్టుకునే ఆయన.. గోట్ మూవీతో మాత్రం మెప్పించలేక పోయారు. సాంగ్స్ పెద్ద ఆకట్టుకోలేకపోయాయి. చెప్పాలంటే రిలీజ్ కు ముందు సినిమాపై అనుకున్న స్థాయిలో బజ్ క్రియేట్ అవ్వలేదు. మిగతా భాషలను పక్కన పెడితే తమిళంలోనూ హైప్ తీసుకు రాలేకపోయారు మేకర్స్. దీంతో ఇప్పుడు అనిరుధ్ కోసం అంతా మాట్లాడుకుంటున్నారు.

యావరేజ్ మూవీస్ ను కూడా హిట్ చేసే టాలెంట్ ఉన్న అనిరుధ్.. గోట్ చిత్రానికి వర్క్ చేసి ఉంటే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు. తన సాంగ్స్ తో సినిమా రిలీజ్ కు ముందు బజ్ క్రియేట్ చేసి ఉండేవారని అంటున్నారు. అనవసరంగా విజయ్.. అనిరుధ్ ను మిస్ అయ్యారని చెబుతున్నారు. కోలీవుడ్ లో కూడా సినిమాకు ప్లస్ అయ్యే ఉండేదని అంటున్నారు. ఇప్పుడు రిలీజ్ అయ్యాక ఏం చేయలేం కదా అని కామెంట్లు పెడుతున్నారు.