Begin typing your search above and press return to search.

అనిరుధ్ బీట్స్ క్లిక్కయినా.. ట్రోల్స్ ఆగట్లే..

సౌత్ ఇండియాలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ లలో ఒకరుగా అనిరుద్ రవిచందర్ ఉన్నారు.

By:  Tupaki Desk   |   5 Sep 2024 7:27 AM GMT
అనిరుధ్ బీట్స్ క్లిక్కయినా.. ట్రోల్స్ ఆగట్లే..
X

సౌత్ ఇండియాలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ లలో ఒకరుగా అనిరుద్ రవిచందర్ ఉన్నారు. కోలీవుడ్ లో మేగ్జిమమ్ స్టార్ హీరోల సినిమాలన్నింటికి అనిరుద్ మ్యూజిక్ డైరెక్టర్ గా చేస్తున్నారు. అలాగే ఈ దశాబ్ద కాలంలో ఎన్నో బ్లాక్ బస్టర్ సాంగ్స్ అనిరుద్ నుంచి వచ్చాయి. గత ఏడాది రిలీజ్ అయిన జైలర్, లియో సినిమాల సక్సెస్ లలో అనిరుద్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కి కూడా క్రెడిట్ లభిస్తుందని చెప్పాలి.

అనిరుద్ రవిచందర్ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నాడు అంటే ఆ సినిమాకి ఎంతో కొంత హైప్ వస్తుంది. అయితే కోలీవుడ్ లో వచ్చినన్ని సక్సెస్ లు అనిరుద్ కి టాలీవుడ్ లో లభించలేదు. పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమాతో అనిరుద్ మ్యూజిక్ డైరెక్టర్ గా టాలీవుడ్ లోకి అడుగుపెట్టారు. ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది. అజ్ఞాతవాసి సినిమాలో సాంగ్స్ హిట్ టాక్ సొంతం చేసుకున్నాయి.

తరువాత జెర్సీ మూవీకి అనిరుద్ మ్యూజిక్ అందించారు. ఈ సినిమా సాంగ్స్ కూడా క్లిక్ అయ్యాయి. మూవీ పర్వాలేదనే టాక్ మాత్రమే తెచ్చుకుంది. తరువాత నాని గ్యాంగ్ లీడర్ సినిమాకి అనిరుద్ పనిచేశారు. ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది. ఈ సినిమా సాంగ్స్ కూడా బాగా పాపులర్ అయ్యాయి. మరల చాలా గ్యాప్ తర్వాత తెలుగులో కూడా దేవర సినిమాకి అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నారు.

ఈ సినిమాతో కమర్షియల్ సక్సెస్ కొట్టాలనే కసితో అనిరుద్ ఉన్నారు. కానీ అనిరుద్ కెరియర్ లో ఎన్నడూ లేనన్ని విమర్శలు దేవర సాంగ్స్ ద్వారా ఎదుర్కొంటున్నాడు. దేవర ఫస్ట్ సింగిల్ అయిన ఫియర్ సాంగ్ లియో మూవీలోని బ్యాడాస్ తరహాలోనే ఉందనే విమర్శలు వచ్చాయి. అయిన ఈ సాంగ్ 80 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది.

దేవర సెకండ్ సింగిల్ చుట్టమల్లే కూడా పెద్ద హిట్ అయ్యింది. ఈ సాంగ్ కి ఏకంగా 100 మిలియన్ వ్యూవ్స్ వచ్చాయి. అయితే ఈ సాంగ్ ని శ్రీలంక ప్రైవేట్ ఆల్బమ్ పాట 'మానికే మగే హైతే' ట్యూన్ ని కాపీ కొట్టి చేసాడనే విమర్శలు వచ్చాయి. ఈ సాంగ్ హిట్ అయిన కూడా అనిరుద్ పై సోషల్ మీడియాలో దారుణమైన ట్రోలింగ్ నడిచింది. ఒరిజినల్ సాంగ్ కి మ్యూజిక్ కంపోజ్ చేసిన చామత్ కూడా ఈ కాపీట్యూన్ పై రియాక్ట్ అయ్యాడు. అయితే ఈ ఆరోపణలపై అనిరుద్ రవిచందర్ రియాక్ట్ కాలేదు.

ఇదిలా ఉంటే దేవర మూవీ నుంచి దావుదీ అనే వీడియో సాంగ్ ని తాజాగా రిలీజ్ చేశారు. ఈ సాంగ్ ఎన్టీఆర్ అభిమానులకి విపరీతంగా కనెక్ట్ అయ్యింది. అయితే అనిరుద్ ఈ సాంగ్ ని బెస్ట్ మూవీలో అరబిక్ కతు, జైలర్ లోని కావాలయ్య సాంగ్ ట్యూన్స్ మిక్స్ కొట్టి చేసాడనే విమర్శలు వస్తున్నాయి. అనిరుద్ గతంలో ఏ సినిమా సాంగ్స్ విషయంలో ఇంత దారుణమైన ట్రోలింగ్ పేస్ చేయలేదు. మొదటిసారిగా దేవరకి మాత్రం కాపీ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీనిపై అతను ఏమైనా వివరణ ఇస్తాడా లేదా అనేది వేచి చూడాలి.