ఆ ఇద్దరి మధ్యలో మరొకరు..ఇక త్రిముఖ పోరు!
చివరికి అతడి అవకాశాలు సైతం తమన్ కి అందుకుంటున్నాడనే చర్చ పరిశ్రమలో పెద్ద ఎత్తున జరిగింది.
By: Tupaki Desk | 3 Feb 2025 3:30 PM GMTరాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్, థమన్ మధ్య మ్యూజికల్ గా ఎప్పుడూ పోటీ ఉంటుంది. కొంత కాలంగా ఇద్దరు ట్రెండింగ్ లో ఉండటంతో ఈ రకమైన వాతావరణం అలుముకుంది. తొలుత దేవి శ్రీ ప్రసాద్ పుల్ ఫామ్ లో కొనసాగాడు. కొన్నాళ్ల పాటు అతడికి తిరుగులేదు. స్టార్ హీరోలందరి చిత్రాలకు దేవినే వాయించేవారు. అయితే థమన్ ఎంటర్ అయిన కొంత కాలానికి సీన్ మారింది. కాలక్రమంలో దేవి శ్రీకి పోటీగా మారాడు. చివరికి అతడి అవకాశాలు సైతం తమన్ కి అందుకుంటున్నాడనే చర్చ పరిశ్రమలో పెద్ద ఎత్తున జరిగింది.
అయితే ఇప్పుడు వాళ్లిద్దరి మద్య లోకి మరో మ్యూజిక్ సంచలనం చేరింది. అతడే అనిరుద్. అజ్ఞాత వాసితో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన అనిరుద్ అటుపై 'జెర్సీ', 'గ్యాంగ్ లీడర్' సినిమాలకు పనిచేసాడు. ఆ తర్వాత మళ్లీ మూడేళ్ల పాటు టాలీవుడ్ వైపు చూడలేదు. గత ఏడాది రిలీజ్ అయిన 'దేవర' చిత్రానికి తానే సంగీతం అందించాడు. దీంతో మరోసారి అనిరుద్ పేరు ఇండస్ట్రీలో మారు మ్రోగింది. మ్యూజికల్ గా ఆ సినిమా మంచి విజయం సాధించింది. ఆర్ ఆర్ లోనూ తిరుగులే దనిపించాడు.
'దేవర2'కి కూడా తానే సంగీతం అందిస్తున్నాడు. ఇది గాక మరో రెండు..మూడు తెలుగు సినిమాలకు సైన్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో టాలీవుడ్ లో అనిరుద్ వెయిట్ పెరుగుతుంది. ఆ రకంగా దేవి శ్రీ ప్రసాద్-థమన్ మధ్యలోకి అనిరుద్ ఎంటర్ అయినట్లు కనిపిస్తుంది. దీంతో ఈ ముగ్గురి మధ్య బిగ్ వార్ తప్పలేలా లేదు. ఇప్పటికే దేవి-తమన్ మధ్య వార్ అంటూ ఎప్పటికప్పుడు చర్చకొస్తుంది. మీడియా కథనాలు అంతకంతకు హీటెక్కిస్తున్నాయి.
వాళ్ల మధ్యలో అనిరుద్ కూడ ఎంటర్ అయితే వాతావరణం మరింత వెడెక్కుతుంది. అసలే అనిరుద్ సంగీతంలో సంచలనం. మనసు పెట్టి బాదాడంటే? థియేటర్లు దద్దరిల్లిపోతాయి. ఆ విషయంలో తమన్ నే మించిపోతాడు. పిట్ట చిన్నది కూత ఘనం అన్న మాదిరి ఇప్పటికే ప్రూవ్డ్ పర్సన్. మరి ఈ ముగ్గురి మధ్య భవిష్యత్ లో త్రిముఖ పోరు తప్పదేమో.