ఇప్పుడు ఈయన ఇండియాలోనే నెంబర్ వన్!
రోబో తర్వాత సూపర్ స్టార్ రజినీకాంత్ కెరియర్ కి బ్లాక్ బస్టర్ ని జైలర్ తో నెల్సన్ దిలీప్, అనిరుద్ అందించారు.
By: Tupaki Desk | 9 Oct 2023 5:30 PM GMTకోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ ఇప్పుడు టాప్ గేర్ లో ఉన్నారు. వరుస సక్సెస్ లతో మంచి జోరు మీద ఉన్న అనిరుద్ కి ఈ ఏడాది జైలర్, జవాన్ రూపంలో రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ వచ్చాయి. ఈ రెండు సినిమాల సక్సెస్ లో మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుద్ పాత్ర కూడా చాలా కీలకంగా ఉందని చెప్పాలి. జైలర్ మూవీలో విషయంలో అయితే ఇంకా ఎక్కువ క్రెడిట్ ఇవ్వాలి.
ఒక సాదాసీదా స్టొరీకి తన మ్యూజిక్ తో అనిరుద్ ప్రాణం పోశారు. రోబో తర్వాత సూపర్ స్టార్ రజినీకాంత్ కెరియర్ కి బ్లాక్ బస్టర్ ని జైలర్ తో నెల్సన్ దిలీప్, అనిరుద్ అందించారు. దీంతో రజినీకాంత్ నెక్స్ట్ చేయబోయే రెండు సినిమాలకి కూడా అనిరుద్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా కన్ఫర్మ్ చేసేశారు. కోలీవుడ్ లో అనిరుద్ ఇని మొదటిగా నమ్మి అవకాశం ఇవ్వడమే కాకుండా ఎక్కువ సినిమాలు చేసింది ధనుష్ అని చెప్పాలి.
అతని సక్సెస్ జర్నీలో అనిరుద్ కూడా భాగం అయిపోయారు. అట్లీ కూడా తన సినిమాలకి ఎక్కువగా అనిరుద్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకుంటూ వచ్చారు. ఒకప్పుడు కోలీవుడ్ అంటే ఏఆర్ రెహమాన్ పేరు ఎక్కువగా వినిపించేది. అయితే ఇప్పుడు అనిరుద్ పేరు వినిపిస్తోంది. సినిమాల సంఖ్య పెరగడంతో పాటు స్టార్స్ అందరూ కూడా అనిరుద్ కావాలంటూ ఉండటంతో అతని రెమ్యునరేషన్ కూడా పెంచేశాడు.
ఆర్ఆర్ఆర్ సినిమాకి గాను కీరవాణి ఇండియాలోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకున్న మ్యూజిక్ డైరెక్టర్ గా మారారు. ఏఆర్ రెహమాన్ కూడా 10 నుంచి 12 కోట్ల వరకు చార్జ్ చేస్తున్నారు. అతను తక్కువ సినిమాలు చేసిన అదే రేంజ్ లో బ్రాండ్ మెయింటేన్ చేస్తున్నారు. అయితే అనిరుద్ ఇప్పుడు వీరిద్దరిని బీట్ చేసేశారు. జైలర్ మూవీ తర్వాత రెమ్యునరేషన్ అమాంతం పెంచేశాడు. 15 నుంచి 20 కోట్ల వరకు మూవీని బట్టి చార్జ్ చేస్తున్నారంట.
నిర్మాతలు కూడా అనిరుద్ కి ఉన్న డిమాండ్ నేపథ్యంలో అంత పెద్ద మొత్తంలో ఇవ్వడానికి సిద్ధం అయిపోతున్నారు. దీంతో ఇప్పుడు ఇండియాలోనే మ్యూజిక్ డైరెక్టర్ గా హైయెస్ట్ రెమ్యునరేషన్ అనిరుద్ అందుకుంటున్నాడు. ఇదే స్పీడ్ కొనసాగిస్తే మాత్రం కచ్చితంగా అతని రెమ్యునరేషన్ 20 కోట్లు దాటిపోయిన ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. జవాన్ సినిమాతో హిందీలోకి కూడా అనిరుద్ అడుగుపెట్టాడు. దీంతో బాలీవుడ్ నుంచి కూడా అతనికి ఆఫర్స్ పెరుగుతున్నాయి.