థమన్.. డీఎస్పీలకి పోటీగా అతను దిగుతున్నాడా?
తమిళ సంగీత దర్శకుడు అనిరుద్ రవిచంద్రన్
By: Tupaki Desk | 18 July 2023 6:55 AM GMTప్రస్తుతం టాలీవుడ్ లో మ్యూజిక్ పరంగా థమన్ వేవ్ కొనసాగుతుంది. స్టార్ హీరోలంతా థమన్ నే కోరుకుంటున్నారు. అంతకు ముందు వరకూ దేవి శ్రీ ప్రసాద్ కొనసాగితే..ఇప్పుడతని స్థానంలో థమన్ బిజీ అయ్యాడు. ఇద్దరి మధ్య చాన్సుల పరంగా తగ్గాఫ్ వార్ నడిచినప్పటికీ అంతిమంగా థమన్ చేతిలో ఎక్కువ ప్రాజెక్ట్ లు లాక్ అవ్వడంతో! డీఎస్పీ వేగం నెమ్మదించినట్లు అయింది.
ఈ నేపథ్యంలో తమిళ సంగీత దర్శకుడు అనిరుద్ రవిచంద్రన్ మెరుపులా దూసుకొస్తున్నాడు. ఇంత కాలం కోలీవుడ్ కే పరిమితమైన అనిరుద్ తెలుగు సినిమా పాన్ ఇండియా క్రేజ్ చూసి ఇక్కడా తన మార్క్ వేయాలని గట్టి పట్టుదలతో ఉన్నాడు.
ఇప్పటికే సక్సెస్ ఫుల్ కంపోజర్ గా కోలీవుడ్ ని షేక్ చేస్తోన్న అనిరుద్ ఇప్పుడిప్పుడే తెలుగులో కూడా బిజీ అవుతున్నాడు. అతను కమిట్ అయ్యే ప్రాజెక్ట్ లన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉండేలా చూసుకుంటున్నాడు.
అవకాశాలు చాలా వస్తున్నా కొన్ని సమీకరణాలకు లోబడి కమిట్ అవుతున్నాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తోన్న 'దేవర'..'విజయ్ దేవరకొండ- గౌతమ్ తిన్ననూరి' సినిమాలకు పనిచేస్తున్నాడు. అయితే అనిరుద్ ..థమన్..డీఎస్పీలతో పోటీ పడాలంటే కాస్త స్టైల్ మార్చాలి. మాస్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే మాస్ బీట్స్ అందించాలి. కోలీవుడ్ తరహా కంపోజింగ్ ఇక్కడ వర్కౌట్ అవ్వదు. మాస్ కి పూనకాలు తెప్పించేలా థమన్..డీఎస్పీ లెవల్లో ఉండాలి.
అప్పుడే ఇక్కడ కనెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పటటికే అనిరుద్ కొన్ని తెలుగు సినిమాలు చేసాడు. అజ్ఞాతవాసి కి అప్పటికే సంగీతం అందించాడు. అందులో రెండు పాటలు మినహా ఏవీ శ్రోతలకి ఎక్కలేదు. అలాగే జెర్సీ క్లాస్ సినిమా కావడంతో ఆయన సంగీతం అప్పుడు అందరికీ రీచ్ కాలేదు.
కోలీవుడ్ లో కొంత మంది అగ్ర హీరోలకు పనిచేసిన సినిమాలు ఆశించిన ఫలితాలు రాకపోవ డంతో అనిరుద్ కి మైనస్ గా చెప్పొచ్చు. వాటన్నింటిని బ్యాలెన్స్ తెలుగు సినిమాలకు పనిచేయాల్సి ఉంటుంది. అప్పుడే థమన్...డీఎస్పీ తరహాలో ఇక్కడా బిజీ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది.