Begin typing your search above and press return to search.

10 కోట్ల రెమ్యునరేషన్.. నెలల తరబడి వెయిటింగ్

ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోలు, దర్శకులు మ్యూజిక్ కోసం తమిళ్ సెన్సేషన్ అనిరుద్ వెంట పడుతున్నారు.

By:  Tupaki Desk   |   9 Feb 2024 4:28 AM GMT
10 కోట్ల రెమ్యునరేషన్.. నెలల తరబడి వెయిటింగ్
X

ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోలు, దర్శకులు మ్యూజిక్ కోసం తమిళ్ సెన్సేషన్ అనిరుద్ వెంట పడుతున్నారు. టాలీవుడ్ దర్శకులకి మొదటి నుంచి తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్స్ మీద ప్రత్యేకమైన ఫీలింగ్ ఉంటుంది. ఇళయరాజా మొదలుకొని అనిరుద్ వరకు చాలా మంది సక్సెస్ ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్స్ గా రాణించినవారు ఉన్నారు. వారి వెంటపడి భారీ రెమ్యునరేషన్ చెల్లించి మరి తమ సినిమాలకి వర్క్ చేయించుకుంటారు.

తెలుగులో స్టార్ ఇమేజ్ అందుకొని మోస్ట్ సక్సెస్ ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిపించుకుంది మాత్రం ఒక్క ఇళయరాజానే. ఆ స్థాయిలో ఇంకెవ్వరూ కూడా టాలీవుడ్ ప్రేక్షకులని మెప్పించలేకపోయారు. కొంతమంది దర్శకులు మెరుపులు మెరిపించి అవి ఎక్కువ కాలం కొనసాగలేదు. వరల్డ్ లోనే టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన ఏఆర్ రెహమాన్ కి కూడా తెలుగులో చెప్పుకోదగ్గ ఒక్క సక్సెస్ ఆల్బమ్ లేదు.

ఇప్పుడు కోలీవుడ్ సెన్సేషన్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ వెంట తెలుగు దర్శకులు పడుతున్నారు. జైలర్ మూవీ సక్సెస్ క్రెడిట్ లో మెజారిటీగా మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ కి దక్కుతుంది. అందుకే ఇప్పుడు స్టార్ హీరోలతో సినిమాలు చేసే దర్శకులు అనిరుద్ ని మూవీస్ కోసం తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏకంగా 10 కోట్ల వరకు అనిరుద్ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నాడు.

అలాగే ఒక్కో సాంగ్ కోసం నెలల తరబడి వెయిట్ చేయిస్తున్నాడంట. అతని ఫస్ట్ ప్రాధాన్యత కోలీవుడ్, తరువాతనే తెలుగు సినిమా. ఈ కారణంగానే ట్యూన్స్ ఇవ్వడం కోసం నెలల తరబడి టైం తీసుకొని ఇస్తున్నాడంట. అయితే దర్శకులు మాత్రం అనిరుద్ తోనే మూవీస్ చేయడం కోసం ఆసక్తి చూపిస్తున్నారు.

అయితే ఇప్పటి వరకు ఆయన మ్యూజిక్ డైరెక్షన్ లో వచ్చిన తెలుగు సినిమాలు ఏవీ కూడా కమర్షియల్ సక్సెస్ అందుకోలేదు. పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి డిజాస్టర్ అయ్యింది. అలాగే నాని గ్యాంగ్ లీడర్ డిజాస్టర్ అయ్యింది. సమంత యూటర్న్ సినిమాకి సంగీతం అందించగా అది కూడా ఫ్లాప్ అయ్యింది. ప్రస్తుతం దేవర చిత్రానికి అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నారు. అలాగే విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో మూవీ కూడా చేయనున్నాడు. అయిత్ మాతృభాష తమిళంలో మాత్రం జైలర్, జవాన్ లతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాడు.