అనిత గ్లామర్ ఎటాక్..!
అందాలతో పాటుగా కవ్వించే కళ్లు మత్తెక్కించే చూపులు బాబోయ్ అనిత కూడా ఇక రెచ్చగొట్టేందుకు రెడీ అన్నట్టుగా హింట్ ఇస్తుంది.
By: Tupaki Desk | 20 Sep 2023 11:30 PMనువ్వు నేను అనిత గుర్తుంది కదా అప్పట్లో యూత్ ఆడియన్స్ హృదయాలను కొల్లగొట్టిన ఈ అమ్మడు తెలుగుతో పాటుగా సౌత్ అన్ని భాషల్లో నటించింది. అంతేకాదు హిందీ లో కూడా తన సత్తా చాటాలని ప్రయత్నించింది. కెరీర్ 2001 నుంచి దాదాపుగా 30కి పైగా సినిమాలు చేసిన అనిత టీవీ రంగంలోనూ తన హవా కొనసాగించింది. ఎక్కడ ఛాన్స్ వచ్చినా సరే వదలకుండా చేస్తూ వచ్చిన అనిత స్టార్ క్రేజ్ దక్కలేదు కానీ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు అయితే వచ్చింది.
ఇక ఈమధ్య నిన్నటి తరం హీరోయిన్స్ అంతా కూడా ఆడియన్స్ లో తమకున్న ఈ ఐడెంటిటీని ఇంకాస్త పెంచుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు. వారి దారిలోనే అనిత కూడా సోషల్ మీడియాని వాడుకుంటూ తన గ్లామర్ ట్రీట్ తో ఫాలోయింగ్ పెంచుకుంటుంది. పెళ్లై బాబుతో సంతోషంగా జీవితాన్ని సాగిస్తున్న అనిత మళ్లీ సినిమాల్లో రాణించాలనే ఆలోచన వచ్చింది. ఈమధ్య భామలంతా కూడా రీ ఎంట్రీ ఇచ్చి అదరగొట్టేస్తున్నారు.
వారి రూట్ లోనే అనిత కూడా మళ్లీ వరుస సినిమాలు చేయాలని అనుకుంటుందట. అందుకే ఫోటో షూట్స్ తో ముందు ఫాలోవర్స్ ని పెంచుకునే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే అనిత ఫోటో షూట్స్ కొన్ని వైరల్ కాగా లేటెస్ట్ గా అమ్మడి హాట్ షో ఆడియన్స్ కి పిచ్చెక్కేలా చేస్తుంది. లేటెస్ట్ గా అనిత బికినీ పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. థై షోస్ తో పాటుగా అమ్మడిలో దాగి ఉన్న అందాలన్నీ బయటపడుతున్నాయి. అందాలతో పాటుగా కవ్వించే కళ్లు మత్తెక్కించే చూపులు బాబోయ్ అనిత కూడా ఇక రెచ్చగొట్టేందుకు రెడీ అన్నట్టుగా హింట్ ఇస్తుంది.
తెలుగులో ఈమధ్య ఒకప్పటి హీరోయిన్స్ కి మంచి పాత్రలే పడుతున్నాయి. అనిత అందుకు రెడీ అంటే టాలీవుడ్ నుంచే వరుస ఛాన్స్ లు వచ్చేలా ఉన్నాయి. అనిత లేటెస్ట్ ఫోటో షూట్ ఆమె ఫ్యాన్స్ ని దిల్ ఖుష్ చేస్తున్నాయి. మరి అనిత చేస్తున్న ఈ అటెంప్ట్ ఆమెకు అవకాశాల రూపంలో మారుతాయా లేదా అన్నది చూడాలి.
సినిమాల్లో కనిపించకపోయినా ఈమధ్య తరచు యాడ్స్ లో అనిత దర్శనమిస్తుంది. తెలుగులో చేసిన సినిమాలు తక్కువే అయినా అవి ఆడియన్స్ లో బాగా రిజిస్టర్ అయ్యాయి కాబట్టి అనితకు తెలుగులో ఎప్పటికైనా మంచి అవకాశాలు వస్తాయని చెప్పొచ్చు. ఆమె ఏమాత్రం ట్రై చేసినా తెలుగు మేకర్స్ ఆమెను తమ సినిమాల్లో మంచి పాత్రలకు తీసుకునే ఛాన్స్ ఉంటుంది.